వార్తలు | విదేశీ | కథనాలు | అవకాశాలు | ఫలితాలు
ప్రధాన పేజి » వార్తలు » కెరీర్ » వార్తలు » పదవ తరగతి పరీక్ష ఫీజు గడువు అక్టోబర్ 19 (10th class | exam fees date | October 19 | DEO PV Srihari | Schedule)
 
వచ్చే ఏడాది మార్చి 2010లో జరిగే పదవ తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపులకు విద్యాశాఖ షెడ్యూల్‌ను ప్రకటన చేసింది. ఈ షెడ్యూల ప్రకారం.. ఎటువంటి అపరాధ రుసుము లేకుండా.. అక్టోబర్ 19వ తేదీలోగా సదరు పాఠశాలల్లో విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లిస్తే సరిపోతుంది.

ఈ షెడ్యూల్ మొదటి సారి పరీక్షలు రాస్తున్న వారందరికే కాకుండా.. కంపార్ట్‌మెంటల్, రెగ్యులర్, ప్రైవేటు అభ్యర్థులందరికీ వర్తిస్తుందని పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. అపరాధ రుసుమును మూడు దశల్లో చెల్లించే ఏర్పాటు చేశారు. నవంబరు 4వ తేదీలోగా అయితే రూ. 50 అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

అలాగే నవంబరు 19వ తేదీలోగా అయితే రూ. 200, ఆఖరి అవకాశంగా.. డిసెంబర్ 4వ తేదీలోగా.. రూ. 500లు మేరకు అపరాధ రుసుమును చెల్లించాలి. ఈ షెడ్యూల్‌లో ఇక ఎలాంటి మార్పులు, చేర్పులు ఉండబోవని.. పాఠశాల విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.

డీఈఓ పీవీ శ్రీహరి విలేకరులతో మాట్లాడుతూ, తాజాగా విడుదల చేసిన షెడ్యూల్‌లో ఏదేని తేదీల్లో సెలవు దినములు వచ్చినట్లయితే.. సెలవు రోజు తర్వాత వెంటనే వచ్చే పనిదినములను ఆఖరి తేదీగా పరిగణించాల్సి ఉంటుందన్నారు. విద్యార్థుల వద్ద నుంచి నిర్ణయించిన ఫీజు కన్నా ఎక్కువ మొత్తంలో పరీక్ష ఫీజు వసూలు చేస్తే.. సదరు పాఠశాలలపై కఠిన చర్యలను తీసుకుంటామన్నారు.

పరీక్ష ఫీజు వివరాలు.. రెగ్యులర్ విద్యార్థులు రూ. 125 చెల్లించాల్సి ఉంటుంది. మూడు అంతకంటే.. తక్కువ సబ్జెక్టులకు రూ. 110.. ఎక్కువ సబ్జెక్టులుంటే.. రూ. 125 మేరకు చెల్లించాలి. విద్యాలయాల్లో చదవని ప్రైవేట్ అభ్యర్థులకు హాజరు మినహాయింపు ఫీజు రూ. 650, పరీక్ష ఫీజు కింద మరో రూ. 125 మేరకు చెల్లించాలి.

ఈ రెండింటికంటే ముందు.. ప్రత్యేక ఫీజును చెల్లించి ప్రభుత్వ పరీక్షల సంచాలకుని ముందస్తు అనుమతి తప్పనిసరిగా పొందాలి. ఇక పదవతరగతి మొదటి రాయనున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఫీజు చెల్లింపులో మినహాయింపునిస్తారు. కానీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల కుటుంబాల వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల్లో రూ. 24,000లోపు ఉండాలి.

అదే గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ. 20,000లోపు తప్పనిసరిగా ఉండాలి. ఆదాయ పరిమితికి సంబంధించి సదరు విద్యార్థులకు సంబంధించిన మండల రెవెన్యూ అధికారి (ఎంఆర్ఓ) నుంచి కుటుంబ వార్షికాదాయ ధృవీకరణ పత్రాలను ప్రధానోపాధ్యాయులు పరిశీలించాలించి ఆ మీదట తగు నిర్ణయం తీసుకోవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.