ప్రధాన పేజి » వార్తలు » కెరీర్ » వార్తలు » అక్టోబర్ 20 నుంచి డిప్లొమా పరీక్షలు (Diploma exams | October 20 | PT Prabhakar | regular | supplementary | attendance)
రాష్ట్ర సాంకేతిక విద్య మరియు శిక్షణ బోర్డు అక్టోబర్ 20వ తేదీ నుంచి డిప్లొమా పరీక్షలు నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్షలు సంబంధించి షెడ్యూల్ సెప్టెంబర్ 19న అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు రాష్ట్ర సాంకేతిక విద్య మరియు శిక్షణ మండలి కార్యదర్శి పీటీ ప్రభాకర్ వెల్లడించారు.
రెగ్యులర్‌లతో పాటు సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను కూడా ఇచ్చినట్లు తెలిపారు. ఈ షెడ్యూల్ వివరాల కోసం 'ఎస్‌బీటీఈటీఏపీడాట్‌జీఓవీడాట్‌ఇన్'లో చూడండి. 14/10/2009 కన్నా ముందుగా సిలబస్ పూర్తి చేసేలా ఆదేశాలు జారీ చేశారు. 75 శాతం అటెండెన్స్ కలిగి ఉన్న వారు మాత్రమే రెగ్యులర్ ఎగ్జామినేషన్‌కు అనుమతిస్తారు. అలా లేని వారికి పరీక్షలకు అనుతించరు.
ఒకవేళ నిర్ధేశించిన అటెండెన్స్‌లో 10 శాతం తక్కువ ఉన్నట్లయితే.. అభ్యర్థుల నుంచి పెనాల్టీ రుసుమును సేకరించాల్సి ఉంటుంది.