వార్తలు | విదేశీ | కథనాలు | అవకాశాలు | ఫలితాలు
ప్రధాన పేజి » వార్తలు » కెరీర్ » వార్తలు » వచ్చే ఏడాది ఏప్రిల్ 11న ఐఐటీ ప్రవేశ పరీక్ష (IIT entrance exam | Apirl 11 2010 | Under Graduation admission committee | objective)
 
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ప్రవేశానికి దేశవ్యాప్తంగా ఉన్న 15 కేంద్రాల్లో ఉమ్మడి ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు. ఈ పరీక్ష 2010, ఏప్రిల్ 11వ తేదీన నిర్వహించాలని అండర్ గ్రాడ్యుయేషన్ అడ్మీషన్ కమిటీ తన ప్రకటనలో తెలిపింది.

ఈ పరీక్షల్లో రెండు ప్రశ్నా పత్రాలుంటాయి. ఇందులో అబ్జెక్టివ్ టైపులో ప్రశ్నలుంటాయి. ఈ పేపర్లులో రసాయనశాస్త్ర, భౌతిక శాస్త్ర, గణితం సబ్జెక్టుల వారీగా వివిధ విభాగాలుంటాయి. వీటితో పాటు సునిశిత విశ్లేషణా సామర్థ్యం, గ్రహణ శక్తి వంటి అంశాల ద్వారా విద్యార్థుల్లో శక్తి సామర్థ్యాలను అంచనా వేయడం జరుగుతుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.