వార్తలు | విదేశీ | కథనాలు | అవకాశాలు | ఫలితాలు
ప్రధాన పేజి » వార్తలు » కెరీర్ » వార్తలు » మిగిలిపోయిన ఇంజినీరింగ్ సీట్లు: ప్రత్యేక కౌన్సెలింగ్ (Special counselling | engineering seats | Minority colleges | Convenor quota)
 
ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశానికి ప్రత్యేక కౌన్సెలింగ్ వచ్చే నెల.. అంటే అక్టోబర్ ప్రథమార్ధంలో నిర్వహించనున్నారు. అంతకుముందు సింగిల్ విండో- 2 లేదా 3 కింద కన్వీనర్ కోటాలో ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశం కోసం కొన్ని మైనారిటీ కళాలల యాజమాన్యాలు సొంతంగా కౌన్సెలింగ్ నిర్వహించాయి.

అయితే విద్యార్థులు ముందు రాలేదు. దీంతో దాదాపు 3వేలు సీట్లు మిగిలిపోయాయి. ఈ పరిస్థితుల్లో సింగిల్ విండో- 1 కింద కన్వీనర్ కోటాలో భర్తీ చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆయా కళాశాలలు విజ్ఞప్తి చేశాయి. దీంతో మిగిలిన సీట్లను భర్తీ చేసేందుకు.. ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించాలని ప్రభుత్వం జీవో జారీ చేసింది.

రాష్ట్ర ముఖ్యమంత్రి కొణజేటి రోశయ్య నేతృత్వాన విద్యావిభాగపు ప్రధాన కార్యదర్శితో జరిగిన సమావేశంలో ఈ ప్రత్యేక కౌన్సెలింగ్‌ నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.