ప్రధాన పేజి » వార్తలు » కెరీర్ » వార్తలు » క్యాట్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ గడువు పెంపు
(Cat online registration | Last date | IIMs | Prometric | Computer based exam | October 11)
ప్రతిష్టాత్మక ఐఐఎంఎస్‌లో అడ్మీషన్ కోసం కామన్ అడ్మీషన్ టెస్ట్ (క్యాట్)కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఓ శుభవార్త. అంతకుముందు.. అక్టోబర్ 1వ తేదీకే ఈ గడువు ముగింపు తేదీగా ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం గతంలో విధించిన ఈ గడువును అక్టోబర్ 11వ తేదీ వరకు పొడిగిస్తూ.. నిర్ణయం చేయడం జరిగింది.
ఐఐఎంఎస్ కోసం ఓ అమెరికన్ ఏజెన్సీ నిర్వహించే ఈ పరీక్ష.. కంప్యూటర్‌ల ద్వారా ఈ ఏడాది క్యాట్ పరీక్షను నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఇందుకోసం ఆన్‌లైన్ ద్వారానే దరఖాస్తులను స్వీకరించడం జరుగుతోంది. ప్రస్తుతం గడువును పెంచడంతో.. అక్టోబర్ 8వ తేదీ వరకు క్యాట్ దరఖాస్తు విక్రయాలను యాక్సిస్ బ్యాంకు బ్రాంచిలలో అందుబాటులో ఉంచుతున్నట్లు ప్రోమెట్రిక్ (అమెరికా ఏజెన్సీ) తెలిపింది.
ఇటీవల వరుసగా బ్యాంకులకు సెలవులు వచ్చిన నేపథ్యంలో.. ఐఐఎంఎస్ మరియు ప్రోమెట్రిక్ గడువు తేదీని పెంచుతూ సంయుక్తంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నాయి. అంతకుముందు. సెప్టెంబర్ 9వ తేదీ క్యాట్ కోసం నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు వరకు సుమారు లక్షకు పైగా విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను పంపుకున్నారు.
క్యాట్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నవంబర్ 28 మరియు డిసెంబర్ 7వ తేదీ మధ్యలో కంప్యూటర్ ఆధారిత పరీక్షను నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 32 నగరాల్లో 105 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్ష ఉంటుంది. గత ఏడాది ఈ పరీక్షకు సుమారు 2.5 లక్షల మంది హాజరయ్యారు.