ఫెయిర్ అండ్ లౌవ్లీ స్కాలర్‌షిప్‌ల కోసం ఇంటర్వ్యూలు
Srini
WD
విద్యా రంగంలో యువతులను ప్రోత్సహించే నిమిత్తం ఫెయిర్ అండ్ లౌవ్లీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉపకారవేతనాలను అందజేస్తోంది. ఈ స్కాలర్‌షిప్‌లను అందజేసేందుకు ఆ సంస్థ ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది. గత ఏడు సంవత్సరాలుగా దిగ్విజయంగా అందజేస్తూ వస్తున్న ఈ సంస్థ ప్రస్తుత సంవత్సరంలో కూడా ఉపకారవేతనాలను అర్హులైన విద్యార్థులకు అందజేసేందుకు నిర్ణయించింది.
ఇందుకోసం బుధవారం నుంచి తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నయ్‌లో ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది. ఇందులో పలువురు విద్యార్థినిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో హిందుస్థాన్ యూనీలీవర్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ (స్కిన్ కేర్) గోవింద రాజన్ మాట్లాడుతూ.. ఆర్థికంగా వెనుకబడి, విద్యా రంగంలో తమ లక్ష్యాలను చేరుకోలేని విద్యార్థినులకు ఈ ఫెయిర్ అండ్ లౌవ్లీ ఫౌండేషన్ సంస్థ అందజేసే ఉపకారవేతనాలు ఎంతగానో దోహదపడుతాయన్నారు.
విద్యారంగంలో మహిళా సాధికారతను సాధించాలన్న ప్రధాన ఉద్దేశ్యంతో వీటిని అందజేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఇదిలావుండగా, ఈ ఉపకార వేతనాలు అందజేసేందుకు అర్హులైన విద్యార్థినులను ఎంపిక చేసేందుకు నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో తమిళనాడు స్టేట్ కమిషన్ ఫర్ ఉమెన్ డాక్టర్ రమతల్, డైరక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ ఇలంగో, ఐఐటీ ప్రొఫెసర్ ఎస్.శాంతకుమార్, ప్రముఖ రచయిత్రి శివశంకరి తదితరులకు చోటు కల్పించారు.