ప్రధాన పేజి » వార్తలు » కెరీర్ » వార్తలు » టాప్- 100లో మన యూనివర్శిటీలకు స్థానమే లేదు (Universities | Top 100 | Ranks List | QS Times | Indian Universities | Britian | America | education standards)
ప్రపంచంలోని మేథావులు ఎక్కువగా భారత్‌లోనే ఉన్నారంటూ.. అనేక మంది ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నప్పటికీ.. భారత్‌లో ఉన్నత విద్యను అందించే విశ్వవిద్యాలయాల ప్రమాణాలు మాత్రం ఆ స్థాయిలో లేవు. తాజాగా వెల్లడైన అత్యుత్తమ విశ్వవిద్యాలయాల జాబితాలో టాప్- 100లో అసలు భారత్‌కు చెందిన ఏ యూనివర్శిటీ స్థానం సంపాదించలేకపోవడం ప్రమాణాలు ఆస్థాయిలో లేవని చెప్పడానికి ప్రత్యక్ష నిదర్శనం.
పైగా.. ఈ ర్యాంకుల జాబితాలో.. అమెరికా, బ్రిటన్‌లు ఆధిపత్యం వహిస్తున్నాయి. క్యూఎస్/టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ అందించిన ఈ ర్యాంకింగ్స్ ద్వారా ఈ తాజా వివరాలు వెల్లడయ్యాయాయి. 2009 ఏడాదికి చెందిన ఈ ర్యాంకుల్లో అమెరికాకు చెందిన హార్వర్డ్ యూనివర్శిటీ.. యధాతథంగా అగ్రస్థానంలో నిలువగా.. బ్రిటన్‌కు చెందిన కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ.. మూడు నుంచి రెండో స్థానానికి ఎగబాకింది.
అమెరికాలోని యేల్ యూనివర్శిటీ.. ఒక స్థానం కోల్పోయి మూడో స్ధానానికి చేరుకుంది. ఆక్స్‌ఫోర్డ్ యూనివర్శిటీ ఒక స్థానం కోల్పోయి నాలుగో స్థానం నుంచి ఐదో స్థానానికి పడిపోయింది. మొత్తం మీద ఈ జాబితాలో టాప్- 10లో అమెరికా తర్వాత యూకే నాలుగు ర్యాంకులను హస్తగతం చేసుకుని రెండో స్థానంలో నిలిచింది.
యూనివర్శిటీ ఆఫ్ టోక్యో 22వ స్థానమే.. ఆసియాకు చెందిన అత్యధిక యూనివర్శిటీ ర్యాంకుగా చెప్పొచ్చు. గతంలో ఆసియా యూనివర్శిటీలు గతంలో.. టాప్- 100లో 14 ఉండగా.. తాజా జాబితాలో వాటి సంఖ్య 16కు చేరుకుంది. 2008లో విడుదల చేసిన ర్యాంకుల టాప్- 100 జాబితాలో.. ఉత్తర అమెరికా యూనివర్శిటీలు.. 42 ఉండగా.. ఇప్పుడా సంఖ్య 36కు పడిపోయింది.
పరిశోధన సౌకర్యాలు, బోధన నాణ్యత, సామర్థ్యం, ఉద్యోగ అవకాశాలు, విదేశీ విద్యార్థుల సంఖ్య తదితర అంశాలను ఈ అంతర్జాతీయ సర్వేలో ప్రాథమికంగా తీసుకున్నారు. సుమారు 9వేల అకాడెమిక్‌పై ఈ సర్వే నిర్వహించారు. ఈ ర్యాంకుల జాబితా ఆధారంగా పరిశీలిస్తే.. బ్రిటన్‌కు చెందిన రీసెర్చ యూనివర్శిటీలు.. అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ నాణ్యత కలిగిన విద్యా ప్రామాణాలను కలిగి ఉన్నట్లుగా వెల్లవుతోంది.
టాప్- 10లో ఉన్న యూనివర్శిటీలు.. హార్వర్డ్ (అమెరికా), కేంబ్రిడ్జ్ (బ్రిటన్), యేల్ (అమెరికా), యూసీఎల్ (బ్రిటన్), లండన్ (బ్రిటన్), ఇంపీరియల్ కాలేజ్, లండన్ మరియు ఆక్స్‌ఫోర్డ్ (బ్రిటన్) ఈ రెండు సంయుక్తంగా 5వ స్థానంలో ఉన్నాయి. చికాగో (అమెరికా), ప్రిన్స్‌టన్ (అమెరికా), ఎంఐటీ, మసాచుసెట్స్ (అమెరికా), కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (అమెరికా).