వార్తలు | విదేశీ | కథనాలు | అవకాశాలు | ఫలితాలు
ప్రధాన పేజి » వార్తలు » కెరీర్ » వార్తలు » "హెంకెల్ ఎన్విరో కేర్" అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం (Henkel India | announces | Eco-Petition | Enviro Care Award | Career)
Feedback Print Bookmark and Share
 
హెంకెల్ ఇండియా లిమిటెండ్ హెంకెల్ ఎన్విరో కేర్ పేరిట ఒక అవార్డును అందజేయనుంది. ఇందుకోసం ఎకో పిటీషన్ పేరుతో జాతీయ స్థాయిలో పేపర్ ప్రజెంటేషన్‌ను నిర్వహించనుంది. ఈ పోటీలో ఉత్తీర్ణులయ్యే మొదటి ముగ్గరు విజేతలకు నగదు బహుమతితో పాటు.. ఎన్విరో కేర్ అవార్డును సైతం అందజేయనున్నట్టు ఆ సంస్థ తాజాగా విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.

పర్యావరణ పరిరక్షణపై పాఠశాల స్థాయిలో ఈ పోటీని నిర్వహిస్తున్నట్టు ఆ సంస్థ తెలిపింది. ఈ తరహా పోటీలను గత 2005 సంవత్సరం నుంచి తాము నిర్వహిస్తున్నామని, ఈ దఫా హెంకెల్ ఎకో పిటీషన్‌ అనే అంశంపై పోటీలను నిర్వహిస్తున్నట్టు పేర్కొంది. జల వనరుల పరిరక్షణకు ఉన్న మార్గాలపై ఈ పేపర్ ప్రజెంటేషన్ ఉంటుంది. ఇందులో 8, 10, 11, 12 తరగతులకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు పాల్గొనవచ్చు.

చెన్నయ్, బెంగుళూరు, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, కొచ్చిన్, లక్నో, అహ్మాదాబాద్, కోల్‌కతా నగరాలకు చెందిన చిన్నారులు ఈ పోటీలో పాల్గొనేందుకు అర్హులు. భవిష్యత్‌లో నీటి సమస్య ఏవిధంగా ఉండబోతుంది, జన వనరుల స్థితిగతులపై తమ ఆలోచనలను చిన్నారులు కాగితంపై పెట్టాల్సి వుంటుంది.

ప్రపంచ వ్యాప్తంగా నివశిస్తున్న ప్రజలు కరువు కాటకాలు, వరదలు, తీవ్రమైన వర్షాభావం, మంచినీటి వ్యవస్థ, పరిశుభ్రమైన మంచినీటి కొరత తదితర సమస్యలతో సతమతమవుతున్న విషయం తెల్సిందే. ఇలాంటి సమస్యలు భవిష్యత్ తరాల వారికి పెనుసవాల్‌గా ఉన్నాయి. వీటికి పరిష్కార మార్గం కనుగొనేందుకే ఈ తరహా పోటీని నిర్వహిస్తున్నట్టు ఆ సంస్థ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

ఇందులో పాల్గొనే విద్యార్థులు తాము ఎంచుకున్న సమస్యపై 2500 పదాలకు మించకుండా తమ అభిప్రాయాలను ఓ వ్యాసం రూపంలో రాయాల్సివుంటుంది. ఎంపికైన విద్యార్థులను ఫైనల్ పోటీలకు సంస్థ ఆహ్వానించి, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయ నిర్ణేతల సమక్షంలో తమ అభిప్రాయాలను కూడా వెల్లడించాల్సి వుంటుంది.

ఇందులో గెలుపొందే విద్యార్థులకు మొదటి బహుమతిగా రూ.10,000, రెండో బహుమతిగా రూ.75000, మూడో బహుమతిగా రూ.5000 చొప్పున అందజేయనున్నట్టు పేర్కొంది. దరఖాస్తులను వచ్చే నెల 12వ తేదీలోగా హెంకెల్ డాట్ ఎకోపిటిషన్ అట్ ఇన్ డాట్ హెంకెల్ డాట్ కామ్‌కు పంపాల్సి ఉంటుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.