వార్తలు | విదేశీ | కథనాలు | అవకాశాలు | ఫలితాలు
ప్రధాన పేజి » వార్తలు » కెరీర్ » వార్తలు » సిప్ అకాడెమీ ఆధ్వర్యంలో చిత్రలేఖన పోటీలు (Chennai | SIP Academy | Kolor Champ | Childrens | National | School)
Feedback Print Bookmark and Share
 
Srini
WD
తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నయ్‌లో సిప్ అకాడెమీ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి చిత్రలేఖన పోటీలు శనివారం జరిగాయి. స్థానిక అన్నానగర్‌లో అన్నా ఆదర్శ్ మహిళా కళాశాలలో నిర్వహించిన ఈ పోటీల్లో ఆరేళ్ల నుంచి 12 సవంత్సరాల బాలబాలికలు పాల్గొన్నారు. 'గ్లోబల్ ఆర్ట్ ఇండియా' నేతృత్వంలో 'మూడో నేషనల్ కలర్ ఛాంప్-2009' పేరిట ఈ పోటీలను నిర్వహించారు.

ఈ మెగా ఈవెంట్ డ్రాయింగ్ (చిత్రలేఖన) పోటీలకు దేశవ్యాప్తంగా వెయ్యి మందికిపైగా బాలబాలికలు హాజరయ్యారు. నాలుగు రాష్ట్రాల్లోని తొమ్మిది నగరాల్లో ఉన్న 35 గ్లోబల్ ఆర్ట్ కేంద్రాల నుంచి 35 మంది చిన్నారులు కూడా పాల్గొన్నారు. ఈ పోటీల్లో పర్యావరణ కాలుష్యంపై చిన్నారులు తమ అపార ప్రతిభా నైపుణ్యాన్ని చిత్రలేఖనంలో చూపించాల్సి వుంటుంది.

సిప్ అకాడెమీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ దినేష్ విక్టర్ మాట్లాడుతూ, 'ప్రపంచంలోని అద్భుత జంతువుల'ను
Srini
WD
పిల్లలు తమతమ వైవిధ్య భావాలు, ఆలోచనలతో చిత్రలేఖనం ద్వారా ప్రదర్శించడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నట్లు తెలిపారు. అన్ని చిత్రాలు ఒకదానికి ఒకటి వేర్వేరుగా ఉన్నాయన్నారు.


పిల్లల్లో సమయపాలన మరియు క్రమశిక్షణ వంటివి ఏ మేరకు ఉన్నాయో.. ఈ చిత్రాలు తెలుపుతాయన్నారు. కాగా, ఈ కార్యక్రమానికి.. ఎస్‌బీఓఏ మెట్రిక్యులేషన్ హైయర్ సెకెండరీ స్కూల్, చెన్నై ప్రధానోపాధ్యాయులు పి రాజేశ్వరి మీనన్ కూడా హాజరయ్యారు. ఈ పోటీలో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.