వార్తలు | విదేశీ | కథనాలు | అవకాశాలు | ఫలితాలు
ప్రధాన పేజి » వార్తలు » కెరీర్ » వార్తలు » ఇక ఉర్ధూలోను రైల్వే రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్ (Railway Recruitment Exam | Mamata Benerjee | Anantanag | Kasmir)
Feedback Print Bookmark and Share
 
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ పరీక్షలు ఇక నుంచి ఉర్ధూలోను అందుబాటలోకి రానున్నాయి. జమ్మూ కాశ్మీర్ ప్రజలకు మరింత ప్రయోజనం చేకూరనే ఉద్ధేశ్యంతో రైల్వే శాఖ మంత్రి మమత బెనర్జీ ఈ నిర్ణయం తీసుకున్నారు. రైల్వే ఉద్యోగాల్లో నియామకం కోసం నిర్వహించే పరీక్షను ఉర్ధూలోను నిర్వహించి తద్వారా స్థానిక యువకులకు సాయం చేయాలన్నది మమత బెనర్జీ అభిప్రాయం.

కాశ్మీర్ లోయలో.. అనంతనాగ్‌-కాజీగండ్‌ల మధ్య రైల్వే లింకును ప్రారంభించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వచ్చిన సందర్భంగా మమతా బెనర్జీ విలేకరులతో మాట్లాడారు. రైల్వే రిక్రూట్‌మెంట్ పరీక్షలు ఉర్ధూలోని నిర్వహించనున్నామన్నారు. ఇప్పటి వరకు ఈ పరీక్షలు ఇంగ్లీషు, హిందీ భాషల్లో నిర్వహిస్తున్నారు.

ఇతర స్థానిక భాషలతో సహా ఉర్ధూను కూడా తప్పనిసరిగా ఉండేలా చూస్తున్నట్లు మమత తెలిపారు. స్కూళ్లకు, కాలేజీలకు ఇచ్చే రాయితీలను సైతం మరింత విస్తృపరిచినట్లు ఆమె వివరించారు. బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లలోని ముస్లిం స్కూళ్లకు కూడా ఈ రాయితీలు అందుబాటులోకి తెస్తామమన్నారు.

మైనారిటీ మహిళలకు మరియు ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన వారికి కూడా మమత కొన్ని వరాలను ప్రకటించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.