వార్తలు | విదేశీ | కథనాలు | అవకాశాలు | ఫలితాలు
ప్రధాన పేజి » వార్తలు » కెరీర్ » వార్తలు » భారత్‌లో 30శాతం పెరగనున్న ఉపాధి అవకాశాలు!! (India Inc | Hiring Activity | Kelly Services | Employment)
Bookmark and Share Feedback Print
 
దేశీయ కంపెనీలు నుంచి ఈ సంవత్సరం ఉపాధి అవకాశాలు 30శాతం పెరగనున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఐటీ, ఎఫ్ఎంజీసీలు ఇందులో ప్రధాన పాత్ర పోషించనున్నట్లు గ్లోబల్ వర్క్ ఫోర్స్ సొల్యూషన్స్ ప్రొవైడర్ కెల్లీ సర్వీసెస్ తమ అధ్యయనంలో ఈ విషయాన్ని వెల్లడించింది.

మొత్తం 7-8 కీలక అంశాల మీద అధ్యయనం చేసి గత సంవత్సరంతో పోలిస్తే సగటున 30శాతం ఉద్యోగ అవకాశాలు పెరగవచ్చన్న అంచనాకి వచ్చినట్లు కెల్లీ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ కమల్ కరంత్ తెలిపారు.

కంపెనీల విస్తరణ పథకాలు, లాభాల బాటలో నడవటం, బోర్డు డైరెక్టర్లను నియమించటం వంటి అంశాలను పరిశీలిస్తే రానున్న ఆరు నెలల్లో మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని ఆయన తెలిపారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.