వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్తగా మరో నాలుగు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మాస్ కవరేజ్ కమ్మూనికేషన్(ఐఐఎంసీ) కేంద్రాలను ప్రారంభించనున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖామంత్రి అంబికా సోనీ తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే ఈ కేంద్రాలను కేరళ, జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్రలోని విదర్భ, మిజోరాంలోని ఐజ్వాల్‌లలో ఏర్పాటు చేయనున్నట్లు ఆమె అన్నారు.
ఈ ఐఐఎంసీ కేంద్రాల కోసం ఇప్పటికే 15 ఎకరాల స్థలాన్ని కూడా సేకరించామని, ప్రాధమిక అవసరాలకు ఖర్చయ్యే నిధులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే సమకూర్చుకుంటాయని అంబికా పేర్కొన్నారు. ఇందులో మరో కొత్త డిప్లమో కోర్సును చేర్చనున్నట్లు ఆమె తెలిపారు.