ఆగస్టు 19న ఐసెట్, 29న ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం!
ఈనెల 19వ తేదీ నుంచి ఐసెట్ ప్రవేశానికి కౌన్సెలింగ్ నిర్వహించనుంది. అలాగే, 29వ తేదీ నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్ జరుగుతుందని సాంకేతిక విద్యాశాఖ వెల్లడించింది. వీలైనంత త్వరగా కౌన్సెలింగ్ పూర్తి చేసి నెలాఖరులో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల తరగతులను, సెప్టెంబర్ నెలాఖరులో ఇంజనీరింగ్, ఫార్మసీ తరగతులను ప్రారంభించాలని నిర్ణయించారు. సాంకేతిక విద్యాశాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ బుధవారం సాంకేతిక భవన్‌లో వెల్లడించారు.
రాష్ట్రానికి కొత్తగా మంజూరైన 29 కాలేజీలతో కలిపి మొత్తం 941 ఎంబీఏ కాలేజీల్లో ఉన్న 64,760 సీట్లకు ఈదఫా కౌన్సెలింగ్ జరుగుతుందని మంత్రి వివరించారు. ఈ సారి కొత్తగా వచ్చిన ఒక కాలేజీతో కలుపుకొని మొత్తం 716 ఎంసీఏ కళాశాలల్లోని 49,185 సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.