వార్తలు | విదేశీ | కథనాలు | అవకాశాలు | ఫలితాలు
ప్రధాన పేజి » వార్తలు » కెరీర్ » వార్తలు » కేవలం 18% టెక్నికల్ గ్రాడ్యుయేట్స్‌కి మాత్రమే ఐటీ స్కిల్స్! (IT Services | Engineering Graduates | Skills | Jobs | Aspiring Minds)
Bookmark and Share Feedback Print
 
చాలా ఐటీ కంపెనీలు సరైన మానవ వనరులు(మ్యాన్ పవర్) లేక సతమతవుతున్నాయి. ఐటీ రంగాల్లో ఉద్యోగ అవకాశాల బోలెడు ఉన్నప్పటికీ వారికి సరిపోయే సిబ్బంది దొరక్క కంపెనీలు చిక్కుల్లో పడుతున్నాయి. తాజా పరిశోధనల ప్రకారం వృత్తి విద్యాకోర్సులు చేసిన పట్టభద్రుల(టెక్నికల్ గ్రాడ్యుయేట్స్)లో కేవలం ఎనిమిది శాతం మంది మాత్రమే ఐటీ కంపెనీల అవరాలకు కావలసిన సమర్ధత(స్కిల్స్)ను కలిగి ఉన్నారని వెల్లడిస్తున్నాయి.

ఈ పరిశోధనలో భాగంగా "యాస్పైరింగ్ మైండ్స్" అనే టెక్నాలజీ అసెస్‌మెంట్ కంపెనీ 40,000 మంది తాజాగా పాసైన టెక్నికల్ గ్రాడ్యుయేట్స్‌పై జరిపిన సర్వేలో ఈ విషయాన్ని వెల్లడించింది. వీరిలో చాలామంది ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఐటీ, ఐటీ సంబంధిత రంగాలలో ఉద్యోగాల కోసం మరింత అదనపు శిక్షణ అవసరమని ఈ సంస్థ తెలిపింది.

దేశంలోని 12 రాష్ట్రాలో ఏఎమ్‌సీఏటీ అనే కంప్యూటర్ ఆధారిత పరీక్షను నిర్వహించగా వచ్చిన ఫలితాల ఆధారంగా సంస్థ ఈ నిర్ణయానికి వచ్చింది. ఈ పరీక్షను తాజాగా ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న విద్యార్థులు, ఎంసీఏ(చివరి సంవత్సరం) విద్యార్థులకు నిర్వహించారు.

ఇంగ్లీష్ కమ్యూనికేషన్, క్వాంటిటేటివ్ స్కిల్స్, ప్రాబ్లెమ్ సాల్వింగ్ స్కిల్స్, కంప్యూటర్ సైన్స్, ప్రోగ్రామింగ్ స్కిల్స్ వంటి వాటిలో వీరికి మరింత అవగాహన, శిక్షణ కావాలని ఈ నివేదికలు చెబుతున్నాయి. ఈ పరీక్ష ద్వారా ఎంపిక చేసిన వారిలో కేవలం 17.84 శాతం మంది మాత్రమే ఐటీ సంస్థల అవసరాలకు సరిపోయే స్కిల్స్ ఉన్నాయని సర్వే తెలిపింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.