వార్తలు | విదేశీ | కథనాలు | అవకాశాలు | ఫలితాలు
ప్రధాన పేజి » వార్తలు » కెరీర్ » వార్తలు » గురువారం నుంచి ప్రారంభమైన ఐసెట్‌ కౌన్సిలింగ్‌..! (Management Courses | Students | Counselling | ICet | MBA | MCA)
Bookmark and Share Feedback Print
 
మేనేజ్‌మెంటు కోర్సులలో ప్రవేశం కోసం నిర్వహించే ఐసెట్ కౌన్సిలింగ్ గురువారం నుంచి ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశం కోసం జరిగే ఈ కౌన్సిలింగ్‌ కోసం ఇప్పటికే 50 సహాయక కేంద్రాలు (హెల్ప్‌లైన్ సెంటర్లు) ఏర్పాటయ్యాయి.

ఈ సహాయక కేంద్రాలలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌తో పాటు విద్యార్థులకు వెబ్‌కౌన్సిలింగ్‌‌కు కావలిసిన గుర్తింపు కార్డులను జారీ చేస్తారు. ఈ కార్డుల్లో ప్రత్యేక తరహా పాస్‌వర్డ్‌ వుంటుంది. ఈ పాస్‌వర్డ్ సహాయంతో విద్యార్ధులు ఆన్‌లైన్ వెబ్‌కౌన్సిలింగ్ ద్వారా తమకు నచ్చిన కాలేజీని ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది.

ఈ ఆన్‌లైన్ కౌన్సిలింగ్ ఆగస్టు 21 నుంచి ప్రారంభమవుతుంది. విశాఖపట్టణం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఐసెట్‌లో 15,000 వరకు ర్యాంకు సాధించిన విద్యార్థులకు కౌన్సిలింగ్‌ నిర్వహించనున్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.