ఎంప్లాయిమెంట్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌లో ఖాళీగా ఉన్న లోయర్ డివిజన్ క్లర్కు పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. మొత్తం 42 ఖాళీలు ఉన్నాయి. వీటిలో ఎస్సీ, ఎస్టీలకు ఒక్కొక్కటి చొప్పున కేటాయించగా, బీసీలకు 11, మిగిలినవి జనరల్ కేటగిరీలో ఉన్నాయి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేయదలచిన అభ్యర్థులు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు నిమిషానికి 40 పదాలు (ఆంగ్లం), 35 పదాలు (హిందీ) టైపింగ్ వేగం తప్పనిసరి. సెప్టెంబరు 24, 2010 నాటికి 18 నుంచి 27 యేళ్లకు మించి ఉండరాదు.
పూర్తి చేసిన దరఖాస్తులను సెప్టెంబరు 24వ తేదీ లోపు ది రీజినల్ డైరక్టర్ (ఎస్టాబ్లిష్‌మెంట్), రీజినల్ కార్యాలయం, ఈఎస్ఐ కార్పొరేషన్, 5-9-31/1 బి, ఓల్డ్ గాంధీ మెడికల్ కాలేజ్, బషీర్ బాగ్, హైదరాబాద్ 500063 అనే చిరునామాకు పంపాల్సి ఉంటుంది.
పూర్తి వివరాల కోసం ఈఎస్ఐసి డాట్ ఎన్ఐసి డాట్ ఐఎన్ అనే వెబ్‌సైటును సందర్శించి తెలుసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు 5200 నుంచి 20200 వేతన స్కేలును అందజేస్తారు.