ప్రధాన పేజి » వార్తలు » కెరీర్ » వార్తలు » రెవిన్యూ శాఖలో 4,852 పోస్టులను భర్తీ: మంత్రి ధర్మాన (Revenue Department | Jobs | Posts | Dharmana Prasada Rao)
రెవిన్యూ శాఖలో 4,852 పోస్టులను భర్తీ: మంత్రి ధర్మాన
రాష్ట్ర రెవిన్యూ శాఖలో భారీ నియామకాలు జరగనున్నాయి. జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, వీఆర్ఓలు, టైపిస్టులు, డిప్యూటీ తహసీల్దారు క్యాడర్లలో 4,852 పోస్టులను భర్తీ చేయనున్నామని రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ఈ మేరకు రూపొందించిన ప్రతిపాదనకు రాష్ట్ర ముఖ్య మంత్రి రోశయ్య కూడా అంగీకరించారని ఆయన తెలిపారు.
"పట్టణ ప్రాంతాలలో కొత్తగా 52 తహసీల్దార్ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ఇందుకు అవసరమయ్యే సిబ్బంది నియామకాలకు రోశయ్య ఆమోదం తెలిపారు" అని ధర్మాన అన్నారు.
ఇదిలో ఉంటే... మరోవైపు టైపిస్ట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులను ఒకే స్థాయి పోస్టులగగా పరిగణించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇక నుంచి కొత్తగా జరిగే నియామకాల్లో అభ్యర్ధులకు తప్పనిసరిగా కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలని ప్రభుత్వం తీర్మానించింది. ఈ మేరకు మార్గదర్శకాలను రూపొందించాల్సిందిగా ముఖ్యమంత్రి రోశయ్య ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.వి. ప్రసాద్‌ను ఆదేశించారు.