వార్తలు | విదేశీ | కథనాలు | అవకాశాలు | ఫలితాలు
ప్రధాన పేజి » వార్తలు » కెరీర్ » వార్తలు » ప్రమోషన్ లేదు అందుకే.. ఉద్యోగాలు మానేస్తున్నాం..! (Professionals | Quit jobs | Lack of Promotion | Survey | Regus | Jobs)
Bookmark and Share Feedback Print
 
మన దేశంలో 59శాతం మంది ఉద్యోగస్తులు పదోన్నతి(ప్రమోషన్) లభించడంలేదని తమ ఉద్యోగాలను వదిలేస్తున్నారు. తాము ఎంత కష్టపడి పనిచేసినా.. మేనేజ్‌మెంట్ గుర్తించక పోవడం, మేనేజ్‌మెంటుకు ఉద్యోగులకు మధ్య సమన్వయలోపం వంటి కారణంగా ఉద్యోగులు తమ ఉద్యోగాలకు శెలవు చెబుతున్నారని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి.

రేగస్ అనే సంస్థ నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయాలను బహిర్గతం చేసింది. తమకు సంబంధం ఉన్న 15,000 మంది బిజినెస్ కంపెనీలతో ఫిబ్రవరి - మార్చి 2010 మధ్య కాలంలో నిర్వహించిన ఇంటర్వూలలో 59శాతం మంది ప్రమోషన్లు లేక, మరో 50శాతం మంది ఉన్నత స్థాయి మేనేజ్‌మెంట్ జోక్యం చేసుకోవడం లేదని, మరో 30శాతం మంది ఉద్యోగులపై మేనేజ్‌మెంట్ దృష్టి సారించడం లేదని తెలిపారు.

ఇదే కనుక భవిష్యత్‌లో కూడా కొనసాగితే ఈ సారి వేసవి సెలవు ముగిసే సమయానికి ఉద్యోగ అకాశాలు మెండుగా ఉండే అవకాశం ఉందని రేగస్ తెలిపింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.