వార్తలు | విదేశీ | కథనాలు | అవకాశాలు | ఫలితాలు
ప్రధాన పేజి » వార్తలు » కెరీర్ » వార్తలు » దేశంలోని ఐఐటీలలో అధ్యాపకుల కొరత! (Massive shortage | Teachers | IITs | New Delhi | Country | Career)
Bookmark and Share Feedback Print
 
దేశంలోని అన్ని ఐఐటీలలో అధ్యాపకుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. దేశంలోనే అత్యంత ఉన్నత విద్యాసంస్థలుగా పేరొందిన ఐఐటీలలో ఈ పరిస్థితి నెలకొనడం దేశ విద్యా రంగానికి హాని చేస్తుందని పలువురు విద్యా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఐఐటీ-ఖరగ్‌పూర్‌లో 299 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ తర్వాత స్థానంలో ఐఐటీ-బాంబేలో 222 పోస్టులు, ఐఐటీ-రూర్కెలాలలో 194, ఐఐటీ-మద్రాసులో 138, ఐఐటీ-ఢిల్లీలో 78 చొప్పున కాళీగా ఉన్నాయి. మిగిలి ఐఐటీలలో కూడా ఇదే పరిస్థితి నెలకొనివుంది.

ఐఐటీ-కాన్పూర్‌లో 65 ఖాళీలు ఉండగా, ఐఐటీ-గౌహతిలో 65, ఐఐటీ-రోపాడ్‌లో 48 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇదే పరిస్థితి దేశంలో 15 ఐఐటీలలో నెలకొనివుంది. అంతేకాకుండా, దేశంలోని ఐఐటీలలో అధ్యాపకులు-విద్యార్థుల నిష్పత్తి కూడా చాలా తక్కువగా ఉంది. మన దేశంలో ఈ నిష్పత్తి 1:15గా ఉంది.

అదే హార్వార్డ్ వర్శిటీలో 1:7గా ఉండగా, యూనివర్శిటీ ఆఫ్ హాంకాంగ్, నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్‌లలో ఈ నిష్పత్తి 1:5గా ఉంది. అయితే, కొన్ని ఐఐటీలలో విద్యార్థులు-ఉపాధ్యాయుల నిష్పత్తి ఆశాజనకంగానే ఉన్నప్పటికీ.. వీటిలో అధ్యాపక పోస్టుల ఖాళీలు మాత్రం 34.2 శాతంగా ఉన్నాయి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.