ప్రధాన పేజి » వార్తలు » కెరీర్ » వార్తలు » రాష్ట్రంలో వంద ఎంసీఏ కాలేజీల్లో 'సున్నా' అడ్మిషన్లు! (MBA | MCA seats | Left vacant | Hyderabad | Career | Colleges)
రాష్ట్రంలో వంద ఎంసీఏ కాలేజీల్లో 'సున్నా' అడ్మిషన్లు!
రాష్ట్రంలోని ఎంసీఏ, ఎంబీఏ కళాశాలల పరిస్థితి చాలా దయనీంగా ఉంది. ఈ విద్యా సంవత్సరంలో వంద ఎంసీఏ కళాశాలల్లో ఒక్కరంటే ఒక్క విద్యార్థి కూడా చేరేందుకు ఆసక్తి చూపలేదు. ఫలితంగా అన్ని కళాశాలల్లో ఎంసీఏ సీట్లు భర్తీకాని పరిస్థితి నెలకొంది.
దీనిపై ప్రైవేట్ కళాశాలల యాజమాన్య సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ.. దాదాపు వంద కాలేజీల్లో జీరో అడ్మిషన్లు జరుగగా, మరో 200 కళాశాలల్లో అడ్మిషన్ల సంఖ్య రెండంకెలకు చేరలేదని తెలిపారు. ఫలితంగా 600 ఎంసీఏ కాలేజీల్లో 300 కాలేజీలు మూతపడే పరిస్థితి నెలకొందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలోని 660 కాలేజీల్లో కన్వీనర్ కోటా కింద 34,451 సీట్లు ఉండగా, వీటిలో 64 శాతం సీట్లు ఖాళీగా ఉన్నట్టు తెలిపారు. మొత్తం సీట్లలో 13104 సీట్లు మాత్రమే భర్తీ కాగా, 21347 సీట్లు ఖాళీగా ఉన్నాయి. అలాగే, రాష్ట్రంలో 892 ఎంబీఏ కాలేజీల్లో 52588 సీట్లు అందుబాటులో ఉండగా, 44105 సీట్లు మాత్రమే భర్తీ అయినట్టు వారు వెల్లడించారు.