వార్తలు | విదేశీ | కథనాలు | అవకాశాలు | ఫలితాలు
ప్రధాన పేజి » వార్తలు » కెరీర్ » వార్తలు » మైండ్‌లాజిక్స్ యూనివర్సిటీల సమావేశం (Mindlogicx Announces Universities of India 2012 | Chennai)
PR
నాలెడ్జ్ మేనేజ్‌మెంట్, సాంకేతిక విద్యారంగంలో ప్రముఖమయిన మైండ్‌లాజిక్స్ సంస్థ భారత పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) సంయుక్త ఆధ్వర్యంలో భారత విశ్వవిద్యాలయాల మేధావుల వార్షిక సమావేశాన్ని ఈ నెల 2 నుండి 4వ తేదీ వరకు నిర్వహించింది. పరిశ్రమలు, విద్యా రంగానికి చెందిన వారిని ఒకే వేదిక మీదకు తెచ్చి జాతి నిర్మాణ క్రమంలో భాగస్వాములను చేయడమే ఈ వార్షిక సమావేశ ఉద్దేశమని నిర్వాహకులు చెప్పారు.

సీనియర్ విద్యావేత్తలు, పారిశ్రామిక వేత్తలను ఒక చోటకు చేర్చి, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా భారతీయ విద్యా విధానంలో మార్పులు తీసుకురావడానికి సమావేశం కృషి చేస్తుందని మైండ్‌లాజిక్స్ ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ సీఈఓ, ఎం.డి. సురేష్ ఇలంగోవన్ చెప్పారు. దీనివల్ల ముఖ్యంగా విద్యార్థి లోకం లబ్దిపొందుతుందన్నారు.

ప్రస్తుతం ఉన్నత విద్యా రంగంలో సాంకేతిక నైపుణ్యం అనేది క్లిష్టమయిన అంశంగా మారిందని, మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఉన్నత విద్యా రంగంలో సాంకేతిక నైపుణ్యాలను అందిపుచ్చుకోవడంలో భాగంగా, విశ్వవిద్యాలయాల పరీక్షా విధానంలో సంస్కరణలు చేపట్టడాన్ని ఒక పరిష్కారంగా తాము భావిస్తున్నామన్నారు.

సీఐఐ, తమిళనాడు కౌన్సిల్ ఛైర్మన్ రంగనాథ్ మాట్లాడుతూ, మైండ్‌లాజిక్స్‌తో పారిశ్రామిక వేత్తలు చేతులు కలిపి దేశీయ పారిశ్రామిక అవసరాలను తీర్చడానికి కృషి చేయడం పట్ల హర్షం వ్యక్తం చేసారు. మైండ్‌లాజిక్స్ చీఫ్ టెక్నాలజీ అధికారి పర్గత్ సింగ్ బజ్వా తదితరులు పాల్గొన్నారు.
WebduniaWebdunia