వార్తలు | విదేశీ | కథనాలు | అవకాశాలు | ఫలితాలు
ప్రధాన పేజి » వార్తలు » కెరీర్ » వార్తలు » పీహెచ్‌‌డీ విద్యార్థులకు విక్టోరియా ఇండియా డాక్టర్స్ స్కాలర్‌షిప్స్! (Ph.D | Victoria India Doctors Scholorships | Indian Ph.D Students | Career | Australia)
Students
FILE
మన దేశంలోని ఉత్తమ పిహెచ్.డి విద్యార్థులకు విక్టోరియా ఇండియా డాక్టర్స్ స్కాలర్‌షిప్స్ (వీఐడీఎస్) పది రకాల ఉపకార వేతనాలను అందజేయనున్నారు. దేశంలోని పీహెచ్‌డీ విద్యార్థులకు పది ఉపకార వేతనాలను అందించడంతో పాటు ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలోని తొమ్మిది వర్శిటీల్లో ఒక కళాశాలలో చదివే పీహెచ్‌డీ అభ్యర్థికి మూడేళ్లలో సుమారు 90,000 ఆస్ట్రేలియన్ డాలర్ల ఫీజు మొత్తాన్ని రద్దు చేస్తుంది.

ఇందుకోసం విక్టోరియా ఇండియా డాక్టర్స్ స్కాలర్‌షిప్స్ (వీఐడీఎస్) అనేది రెండేళ్ల పథకాన్ని ప్రవేశపెట్టింది. విక్టోరియా ప్రభుత్వం-ఆస్ట్రేలియా ఇండియా ఇన్సిస్టిట్యూట్‌లు సంయుక్తంగా ఈ వీఐడీఎస్ ఉపకార వేతన పథకాన్ని శుక్రవారం నగరంలో లాంఛనంగా ప్రారంభించాయి. విక్టోరియా-భారత్‌ల మధ్య పరస్పర సంబంధాలను పటిష్ట పరిచే దిశగా విక్టోరియా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు పథకాల్లో ఇది ఒకటి కావడం గమనార్హం.

మనదేశానికి చెందిన పీహెచ్‌డీ విద్యార్థులకు బసచేసే ఖర్చుతో పాటు ప్రయాణ వ్యయం వంటి తదితర పది స్కాలర్‌షిప్‌లను విక్టోరియా ప్రభుత్వం అందజేయనుంది. అలాగే భారతీయ పీహెచ్‌డీ విద్యార్థుల పరిశోధనా కాలంలో ఫీజు మొత్తాన్ని రద్దు చేయనున్నారు.

పుస్తకాలు, సేవలు మరియు చిరు వృత్తులకు చెందిన విక్టోరియా మంత్రి లూయిజ్ ఆషర్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమంలో భారత్‌కు చెందిన విక్టోరియా స్టేట్ సెక్రటరీ జియాఫ్రే కోనహన్, ఆస్ట్రేలియా ఇండియా ఇన్సిస్టిట్యూట్ డైరక్టర్ అమితాబ్, దక్షిణ ఆస్ట్రేలియా ఉపకులపతి డేవిడ్ హాలీ తదితరలు పాల్గొన్నారు. చెన్నై నగరంలోని ఓ నక్షత్ర హోటల్‌లో ఈ కార్యక్రమ ఆవిష్కరణ జరిగింది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న 200 మందితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ఆషర్.. ఈ స్కాలర్‌షిప్‌లు ప్రపంచ వ్యాప్తంగా ప్రతిభ గల విద్యార్థులకు ఎంతగానో సహకరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంకా ఆస్ట్రేలియా - భారత్‌ల మధ్య సత్సంబంధాలను పటిష్టపరుస్తుందని ఆషర్ తెలిపారు.

విక్టోరియాలో 150,000 మంది ఇతర దేశాలకు చెందిన విద్యార్థులు చదువుతున్నారు. ఈ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఉపాధి-వృత్తి కల్పించే రీతిలో ఈ ఉపకార వేతన పథకాలు ఉపయోగపడుతాయని ఆషర్ వెల్లడించారు. 2011 ఆగస్టులో నిర్వహించిన సర్వేలో ప్రపంచ దేశాల్లోనే నివసించేందుకు అనుకూలమైన నగరంగా అత్యధిక ఓట్లు గెలుచుకున్న విక్టోరియాలో భారత పరిశోధనా విద్యార్థులకు ఇచ్చే ఈ స్కాలర్‌షిప్స్‌కు మంచి ఆదరణ లభిస్తుందని ఆషర్ చెప్పారు.

నగరంలో జరిగిన ఈ కార్యక్రమంలో కోనహన్ మాట్లాడుతూ.. 2013వ సంవత్సరానికి చెందిన ఈ ఉపకార వేతన పథకం భారతీయ పరిశోధన విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. విక్టోరియా నగరం భారత్‌కు చెందిన విద్య, వృత్తి కేంద్రాలతో సత్సంబంధాలు కలిగివుందని.. ఈ సంబంధాలను పటిష్టం చేసేందుకు ఈ స్కాలర్‌షిప్ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.

ఈ స్కాలర్‌షిప్ ‌కోసం కింద పేర్కొన్నట్టుగా విక్టోరియాకు చెందిన యూనివర్శిటీలను భారత విద్యార్థులు సంప్రదించవచ్చును. డికిన్ యూనివర్శిటీ, లా ట్రేప్ యూనివర్శిటీ, మోనాష్ యూనివర్శిటీ, ఆర్ఎమ్‌ఐటి యూనివర్శిటీ, స్విన్‌బర్న్ యూనివర్శిటీ, ది ఆస్ట్రేలియన్ కేథలిక్ యూనివర్శిటీ, ది యూనివర్శిటీ ఆఫ్ మెల్‌బోర్న్, యూనివర్శిటీ ఆఫ్ బలార్డ్, విక్టోరియా యూనివర్శిటీలు ఉన్నాయి.

అలాగే, ఈ యూనివర్శిటీల్లోని సైన్స్, పొలిటికల్ సైన్స్, ఆర్ట్స్ వంటి వివిధ సబ్జెక్టులపై పీహెచ్‌డీ చేసే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కాగా, విక్టోరియాలో 200,000 లక్షల మందికి పైగా భారతీయులు నివసిస్తున్నారు. ఇతర దేశాల కంటే విక్టోరియాలోనే అత్యధికంగా భారతీయులు పౌరసత్వం కలిగివున్నారు.

ఇకపోతే విక్టోరియా ప్రభుత్వానికి చెందిన విక్టోరియా డాక్టర్స్ స్కాలర్‌షిప్ పథకం గురించి అధిక వివరాలను తెలుసుకోవాలంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూడాట్‌స్టడీమెల్‌బోర్న్‌డాట్.జిఒవి.ఎయు/స్కాలర్‌షిప్స్, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూడాట్‌స్టడీమెల్‌బోర్న్‌డాట్‌విఐసిడాట్.జిఒవిడాట్ఎయు/హింది/స్కాలర్‌షిప్స్,
డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూడాట్‌ట్రేడ్‌డాట్‌విఐసిడాట్‌జిఒవిడాట్ఎయు అనే వెబ్‌సైట్లను సంప్రదించవచ్చు.
Feedback Print