ప్రధాన పేజి » వార్తలు » కెరీర్ » వార్తలు » ఎఎటి కళాశాలలో లండన్ యూనివర్శిటీ విద్య ప్రారంభం (Aat College Launches University of London Pragrammes in India)
ఎఎటి కళాశాలలో లండన్ యూనివర్శిటీ విద్య ప్రారంభం
శనివారం, 30 జూన్ 2012( 21:21 IST )
FILE
ప్రఖ్యాత లండన్ యూనివర్శిటీ కోర్సులను భారతదేశానికి పరిచయం చేయనున్నట్లు చెన్నైలోని ఎఎటి కళాశాల ప్రకటించింది. మొత్తం 6 సబ్జెక్టులలో బోధన ఉంటుంది. ఎకనమిక్స్, బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్, బిజినెస్, డెవలప్మెంట్ మరియు ఎకనామిక్స్, లా మరియు అకౌంటింగ్, పొలిటిక్స్ మరియు ఇంటర్నేషనల్ రిలేషన్ కూడుకుని ఉన్న కోర్సులను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. విద్యాసంవత్సరాలకు అనుగుణంగా ఈ కోర్సులను ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది.
ఈ సందర్భంగా యూనివర్శిటీ ఆఫ్ లండన్‌కు చెందిన డాక్టర్ కీత్ షార్ప్ మాట్లాడుతూ.... లండన్ కోర్సులను భారతదేశ విద్యార్థులకు పరిచయం చేయడం ఆనందంగా ఉంది. విద్యార్థులు తమ నైపుణ్యాన్ని మరింత పెంచుకునేందుకు ఈ కోర్సులు ఎంతగానో ఉపయోగపడతాయి. లండన్ యూనివర్శిటీలో బోధించే విద్యను ఈ కోర్సుల ద్వారా ఇక్కడే చదువుకునే అవకాశం ఉంది. వీటిని అభ్యసించిన విద్యార్థులు ప్రపంచంలో ఎక్కడైనా రాణిస్తార"ని అన్నారు.
అనంతరం ఎఎటి కళాశాల సీఈఒ రతీష్ బాబు మాట్లాడుతూ... అంతర్జాతీయ స్థాయి విద్యను మా విద్యార్థులకు అందించాలన్న ప్రయత్నమే ఈ కోర్సుల పరిచయం. వీటి ద్వారా విద్యార్థుల భవిష్యత్తు బంగారుబాటగా ఉంటుంది. ఉత్తమ ప్రమాణాలతో కూడిన ఈ కోర్సును అభ్యసించినవారు ప్రపంచంలో ఎక్కడైనా రాణిస్తారన్నారు. కాగా ఏడాదికి ఈ కోర్సు ఫీజు రూ. 3.5 లక్షల వరకూ ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు ఎఎటికాలేజ్ డాట్ కామ్ చూడండి.