అడ్వాన్స్ జాయింట్ ఎంట్రన్స్ టెస్ట్ 2013 ఐ.ఐ.టి అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాం ప్రవేశానికి నిర్వహించే ఐ.ఐ.టి పరీక్షలో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు జాయింట్ అడ్మిషన్ బోర్డ్ ఆఫ్ ఐ.ఐ.టీ మీటింగ్‌లో ఉన్నతాధికారులు తెలియజేశారు. ఈ విధానం ఏప్రిల్ 7న మెయిన్స్ పూర్తయ్యాక జూన్ 2 నుండి కొత్త విధానం అమలులోకి వస్తుందని వివరించారు.
2013 ఐ.ఐ.టి పరీక్షను ఐ.ఐ.టి ఢిల్లీ నిర్వహిస్తుండగా ఇందులో ఇకపై పర్సంటైల్ ర్యాంకింగ్ ద్వారా విధ్యార్థులను ఐ.ఐ.టి అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంకు ఎంపిక చేయనున్నామన్నారు. ఈ ప్రవేశ పరీక్షలో రెండు ముఖ్య విభాగాలుంటాయని.. ఒకటి మెయిన్స్ మరొకటి అడ్వాన్స్‌డ్ టెస్ట్.
విద్యార్థి ముందుగా మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించాక అడ్వాన్స్‌డ్ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుందనీ, అందులో పొందిన ఉత్తీర్ణతా శాతాన్ని బట్టి ఆ విద్యార్థి టాప్ 20 పర్సంటైల్ జాబితాలో ఒకరుగా నిలిస్తేనే అతనికి ఐఐటి ప్రవేశం లభిస్తుందని వెల్లడించారు.