ప్రధాన పేజి   వార్తలు > కెరీర్ > అవకాశాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఐటీఐ, డిప్లొమా హోల్డర్లకు రైల్వే ఉద్యోగాలు
రైల్వేలో ఐటీఐ, డిప్లొమా హోల్డర్లకు 454 ఉద్యోగావకాశాలను అందించేందుకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు నోటీఫికేషన్ జారీ చేసింది. ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన వారికి అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ (80 పోస్టులు), వివిధ విభాగాల్లో ఐటీఐ కోర్సు చేసిన వారికి అసిస్టెంట్ లోకో పైలట్ (122 పోస్టులు) ఉన్నాయి.

అలాగే సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా చేసిన వారికి వర్క్స్ జూనియర్ ఇంజనీర్ (23 పోస్టులు), ఇంజనీరింగ్ జూనియర్ ఇంజనీర్ ( 20 పోస్టులు), మెకానికల్ డిప్లొమా చేసిన వారికి మెకానికల్ జూనియర్ ఇంజనీర్ (20 పోస్టులు), ఎలక్ట్రికల్ డిప్లొమా చేసిన వారికి సిగ్నల్ జూనియర్ ఇంజనీర్ (26పోస్టులు) ఖాళీలు అందుబాటులో ఉన్నాయని తెలిపింది.

ఇవిగాక ఐటీఐ కోర్సులు చేసిన వారికి ఫిట్టర్ టెక్నీషియన్ (66 పోస్టులు), వెల్డర్ టెక్నీషియన్ (56 పోస్టులు), సిగ్నల్ టెక్నీషియన్ (33 పోస్టులు) కూడా ఉన్నాయని వెల్లడించింది. రిజర్వేషన్ ప్రాతిపదికన కేటాయించే ఈ పోస్టులకు సంబంధించిన పరీక్షలకు దరఖాస్తులను 2008 మే 19లోపు అందేలా పంపాల్సి ఉంటుంది. ఇతర వివరాలను ఏప్రిల్ 19-25 తేదీ కలిగిన ఎంప్లాయ్‌మెంట్ పత్రిక ద్వారా తెలుసుకోవచ్చు.
మరిన్ని
రూ. 80వేల జీతంతో సింగపూర్ పాలిటెక్నిక్ కోర్స్
అడ్వర్టయిజింగ్‌లో పిజి డిప్లోమా కోర్సు
కంటెట్ రైటర్లకు చక్కటి ఉపాధి అవకాశాలు
చండీఘర్‌ జాబ్‌మేళాలో భారతీయ విద్యార్థుల హవా
జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పరీక్ష (నెట్)
భారతీయ రిజర్వ్ బ్యాంక్ ముంబై