ప్రధాన పేజి   వార్తలు > కెరీర్ > అవకాశాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఇంజనీరింగ్ చేస్తే దామోదర్ వ్యాలీలో ఛాన్స్
ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ విభాగాల్లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారిని గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ పోస్టుల కోసం దామోదర్ వేలీ కార్పొరేషన్ ఆహ్వానిస్తోంది. ఎలక్ట్రికల్ విభాగంలో 69 (జనరల్-32, ఓబీసీ-35, ఎస్సీ-2), సివిల్ విభాగంలో 50 (జనరల్ 31, ఓబీసీ-40), మెకానికల్ విభాగంలో 71 (జనరల్ -22, ఓబీసీ-18, ఎస్సీ-8, ఎస్టీ-2) పోస్టులు ఉన్నాయి.

ఇవిగాక కంట్రోల్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ విభాగంలో 33 ( జనరల్-17, ఓబీసీ-11, ఎస్సీ-3, ఎస్టీ -2) పోస్టులు ఉన్నాయి. ఇంటర్‌లో అరవై శాతం మార్కులు, ఇంజనీరింగ్‌లో 65 శాతం మార్కులను కనీస అర్హతగా పరిగణిస్తారు. అన్ని సెమిస్టర్లను పరిగణనలోకి తీసుకుంటారు.

చివరి సంవత్సరం చదివే విద్యార్థులు అప్పటివరకు జరిగిన పరీక్షల్లో 65శాతం మార్కులను కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఐదు శాతం మార్కుల మినహాయింపు ఉంది. ఈ పదవులకోసం దరఖాస్తులను ఏప్రిల్ 28తేదీకల్లా దామోదర్ వేలీ కార్పొరేషన్‌కు పంపాల్సి ఉంటుంది.
మరిన్ని
ఐటీఐ, డిప్లొమా హోల్డర్లకు రైల్వే ఉద్యోగాలు
రూ. 80వేల జీతంతో సింగపూర్ పాలిటెక్నిక్ కోర్స్
అడ్వర్టయిజింగ్‌లో పిజి డిప్లోమా కోర్సు
కంటెట్ రైటర్లకు చక్కటి ఉపాధి అవకాశాలు
చండీఘర్‌ జాబ్‌మేళాలో భారతీయ విద్యార్థుల హవా
జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పరీక్ష (నెట్)