డిగ్రీ పూర్తి చేసిన యువతకు సైనిక అకాడెమీల్లో అవకాశం కల్పిస్తున్నారు. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2008 ద్వారా 526మందిని తమ వివిధ అకాడెమీలకు ఎంపిక చేసుకోనేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది.
మిలిటరీ అకాడెమీలో 250, నావల్ అకాడెమీలో 40, ఎయిర్ ఫోర్స్ అకాడెమీలో 32, ఆఫీసర్ ట్రైనింగ్ అకాడెమీ (పురుషులు)లో 175, ఆఫీసర్ ట్రైనింగ్ అకాడెమీ (మహిళలు)లో 29 పోస్టులకోసం ఈ పరీక్ష నిర్వహించనున్నారు.
మిలిటరీ, నావల్, ఎయిర్ ఫోర్స్ అకాడెమీలకు అవివాహిత పురుషులను మాత్రమే ఎంపిక చేస్తారు. మిలిటరీ అకాడెమీ, ఆఫీసర్స అకాడెమీలకైతే ఏదేని సబ్జెక్టులో డిగ్రీ, నావల్ అకాడెమీకి అయితే భౌతికం, గణితాంశాల్లో బీఎస్సీ లేక ఇంజనీరింగ్ డిగ్రీ, వైమానిక అకాడెమీకి అయితే ఎంపీసీతో ఇంటర్‌తో పాటు ఇంజనీరింగ్ డిగ్రీ కలిగి ఉండాలి.
రాత, ప్రతిభ, వ్యక్తిత్వ పరీక్షల ద్వారా ఎంపిక జరుగుతుంది. మిలిటరీ, నావల్, ఎయిర్ ఫోర్స్ అకాడెమీ ఉద్యోగాలకు ఆంగ్లం, సాధారణ పరిజ్ఞానం, గణితం అంశాల్లో, ఆఫీసర్స్ అకాడెమీకి గణితం మినహాయించి పరీక్షలు నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ పరీక్షలు మన రాష్ట్రానికి సంబంధించినంతవరకు హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి కేంద్రాల్లో జరుగనున్నాయి.
ప్రధాన పోస్టాఫీసుల్లో రూ. 20 చెల్లించి, దరఖాస్తులు అందుకోవచ్చు. పూర్తి చేసిన దరఖాస్తులను ది సెక్రటరీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ధోల్పూర్ హౌస్, షాజహాన్ రోడ్డు, న్యూఢిల్లీ-110069 చిరునామాకు మే 19లోపు చేరేలా పంపాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలను ఏప్రిల్ 19-25 తేదీ ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ ద్వారా తెలుసుకోవచ్చు.
|