వార్తలు | విదేశీ | కథనాలు | అవకాశాలు | ఫలితాలు
ప్రధాన పేజి » వార్తలు » కెరీర్ » అవకాశాలు » రూరల్ మేనేజ్‌మెంట్ కోర్సులకు అడ్మీషన్స్ (Admissions | Rural Management Anand | Rural Management courses | PRM | FPRM | CPDM)
 
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్‌మెంట్ ఆనంద్ సంస్థ.. వివిధ మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశం కోసం ధరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కోర్సులు.. వాటికి సంబంధించిన వివరాలను ఈ విధంగా పేర్కొంది.

1. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ ఇన్ రూరల్ మేనేజ్‌మెంట్ (పీఆర్ఎం)
అర్హతలు... డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులను కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండీకాప్ (పీహెచ్)లకు మాత్రం 45 శాతం మార్కులు సరిపోతుంది. పదవతరగతి+ఇంటర్+డిగ్రీ విధానంలో ఉండి ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా ఈ కోర్సుకు ధరఖాస్తు చేసుకోవచ్చు.

2. ఫెలో ప్రోగ్రామ్ ఇన్ రూరల్ మేనేజ్‌మెంట్ (ఎఫ్‌పీఆర్ఎం)
అర్హతలు... పీఆర్ఎం లేదు ఏదేని పీజీలో 50 శాతం మార్కులు లేదా మెడిసిన్, వెటర్నరీ తదితర ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సుల్లో 60 శాతం మార్కులు లేదా ఒక సంవత్సరం అనుభవంతో కూడిన ఇంజినీరింగ్, అగ్రికల్చర్ సైన్స్ తదితర నాలుగేళ్ల ప్రొఫెషనల్ డిగ్రీ కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌లకు యథావిధిగా మార్కుల్లో ఐదు శాతం మినహాయింపు ఉంటుంది.

3. సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఇన్ డైరీ మేనేజ్‌మెంట్ (సీపీడీఎం)
అర్హతలు.. వెటర్నరీ సైన్స్, డైరీ టెక్నాలజీ వంటి కోర్సుల్లో గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా మెకానికల్, సివిల్, ఎలక్ట్రిక్, కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్ వంటి కోర్సుల్లో 60 శాతం మార్కులతో ఇంజినీరింగ్ చేసి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌లకు యథావిధిగా మినహాయింపు ఉంటుంది.

ఆనంద్‌లో ఏదైనా ఒక కోర్సుకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే.. 'ఐఆర్ఎంఏ' పేరిట రూ. 1000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలు రూ. 700లు చెల్లిస్తే సరిపోతుంది. రెండు కోర్సులకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే.. రూ. 1,500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలు రూ. 1,000లు చెల్లిస్తే సరిపోతుంది. ఇక మూడు కోర్సులకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే.. రూ. 1,800 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలు రూ. 1,200లు చెల్లిస్తే సరిపోతుంది.

ఈ డీడీని దరఖాస్తుతో పాటు జతచేసి పంపాలి. ఇన్‌స్టిట్యూట్ లేదా సంబంధిత స్టడీ సెంటర్ల నుంచి దరఖాస్తులు పొందవచ్చు. ఆన్‌లైన్ ద్వారా కూడా ఈ దరఖాస్తులను అభ్యర్థులు పొందవచ్చు. దరఖాస్తులు స్వీకరణకు ఆఖరు తేదీ.. 2009, సెప్టెంబర్ 30.

ప్రవేశ పరీక్ష తేదీ.. 2009, నవంబర్ 8న జరుగుతుంది. మన రాష్ట్రంలో హైదరాబాద్ మరియు విజయవాడల్లో ప్రవేశ పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. మరిన్ని వివరాలకు.. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూఐఆర్ఎంఏడాట్ఏసీడాట్ఇన్‌లో చూడండి.

దరఖాస్తులు పంపవలసిన చిరునామా:
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్‌మెంట్,
పోస్ట్ బాక్స్ నెం. 60,
ఆనంద్- 388 001, గుజరాత్.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.