వార్తలు | విదేశీ | కథనాలు | అవకాశాలు | ఫలితాలు
ప్రధాన పేజి » వార్తలు » కెరీర్ » అవకాశాలు » జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీలో ఉద్యోగాలు (Job opportunities | Jawaharlal Nehru University | Professor | Degree | PG)
 
న్యూఢిల్లీలో వివిధ సబ్జెక్టుల కోసం... ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కోసం జవహర్‌లాల్ యూనివర్శిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

1. ప్రొఫెసర్.. మొత్తం 35 ఖాళీలున్నాయి. అర్హతలు.. పీజీ బోధనలో అనుభవం లేదా డాక్టొరల్ డిగ్రీతో పాటు పదేళ్ల పరిశోధన చేసుండాలి. అలాగే పీజీలో 55 శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలి.

2. అసోసియేట్ ప్రొఫెసర్.. మొత్తం 65 ఖాళీలున్నాయి. డాక్టోరల్ డిగ్రీతో పాటు ఐదేళ్ల పరిశోధన లేకుండా బోధనలో అనుభవం, మంచి అకడమిక్ రికార్డ్ ఉండాలి. అలాగే పీజీలో 55 శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలి.

3. అసిస్టెంట్ ప్రొఫెసర్.. మొత్తం 56 ఖాళీలున్నాయి. పీజీలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. నెట్ క్వాలిఫై లేదా పీహెచ్‌డీ చేసిన వాళ్లు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.

దరఖాస్తుల స్వీకరణకు ఆఖరు తేదీ.. 2009, సెప్టెంబర్ 30.
మరిన్ని వివరాలకు.. 'డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూడాట్‌జేఎన్‌యూడాట్
ఏసీడాట్ఇన్‌'లో చూడండి

పైన పేర్కొనబడిన నిర్ధేశిత వివరాలతో పూర్తి చేసిన దరఖాస్తులను అభ్యర్థులు ఈ క్రింది చిరునామాకు పంపాలి.

ద సెక్షన్ ఆఫీసర్,
రిక్రూట్‌మెంట్ సెల్, రూమ్ నెం. 131,
అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్,
జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ,
న్యూఢిల్లీ- 110 067
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.