ప్రధాన పేజి » వార్తలు » కెరీర్ » అవకాశాలు » మద్రాస్ యూనివర్శిటీ: పీజీ డిప్లొమాలో కొత్త కోర్సు (Organizational Development and Management of change | University of Madras | PG Diploma programme)
హెచ్ఆర్ కన్సల్టింగ్ సంస్థ పీఎస్‌సీఎస్‌తో కలిసి.. మద్రాస్ విశ్వవిద్యాలయం, సైకాలజీ విభాగం పీజీ డిప్లొమాలో కొత్త కోర్సును ప్రారంభించింది. ఆర్గనైజేషనల్ డెవలెప్‌మెంట్ అండ్ మేనేజ్‌మెంట్ ఆఫ్ చేంజ్ పేరిట ఈ పీజీ డిప్లొమా కోర్సును ప్రారంభించడం జరిగింది. తిరుమలై కెమికల్ లిమిటెడ్ ఉపాధ్యక్షుడు, మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ పార్థసారధి చేతుల మీదుగా మద్రాస్ యూనివర్శిటీ ప్రాంగణంలో ఈ కోర్సును ప్రారంభించారు.
భారత్‌లో వ్యాపార మార్పులు పరిణమిస్తున్న ఇలాంటి తరుణంలో.. ఈ తరహా కోర్సులు హెచ్ఆర్ మేనేజర్ స్థాయిలో ఉన్న సమస్యలను సైతం ధీటుగా ఎదుర్కొనేందుకు ఎంతగానో ఉపకరిస్తుందని.. అలాగే వారిలో నైపుణ్యానికి మరిన్ని మెరుగులు దిద్దగలదన్నారు. ప్రస్తుతం భారత్‌లో వ్యాపార పరిశ్రమ కొన్ని సమస్యలు ఎదుర్కొంటోందన్నారు.
మద్రాస్ యూనివర్శిటీలోని సైకాలజీ విభాగపు ప్రొఫెసర్ మరియు అధిపతి కరుణానిధి మాట్లాడుతూ, ఈ కోర్సు అత్యంత వైవిధ్యమైనదిగా అభిప్రాయపడ్డారు. ఈ కోర్సులో చేరే విద్యార్థులను మరింత సమర్థవంతంగా.. నిశిత పరిశీలనా జ్ఞానాన్ని అందిస్తుందన్నారు.