వార్తలు | విదేశీ | కథనాలు | అవకాశాలు | ఫలితాలు
ప్రధాన పేజి » వార్తలు » కెరీర్ » అవకాశాలు » జాబ్స్: ఐటీబీపీలో హెడ్‌కానిస్టేబుల్స్ పోస్టులు (Jobs | ITBP | Head Conistables posts)
Feedback Print Bookmark and Share
 
ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్‌ (ఐటీబీపీ)లో 81 హెడ్‌కానిస్టేబుల్ పోస్టుల్లో గ్రూప్- సీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. దీనికి సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

మొత్తం.. 81 ఖాళీలున్నాయి. ఇందులో ఎస్సీలకు.. 33, ఎస్టీలకు... 14, ఓబీసీలకు.. 32, జనరల్ కేటగిరీలకు.. 2 పోస్టులున్నాయి. రూ. 5,200 నుంచి 20,200 వరకు వేతన శ్రేణి ఉంటుంది. ఇంటర్మీడియట్ లేదా దాని సమాన అర్హత అభ్యర్థులు కలిగి ఉండాలి. టైప్ రైటింగ్ అదనపు అర్హతగా కలిగి ఉండాలి.

నిమిషానికి 30 ఇంగ్లీష్ పదాలు.. అలాగే 25 హిందీ పదాలను చేయగలిగి ఉండాలి. 2009, డిసెంబర్ 2 నాటికి 20 నుంచి 25 ఏళ్ల వయసులోపు వారు అర్హులు. అయితే ఇందులో ప్రభుత్వం నిబంధనల ప్రకారం.. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల పాటు వయోపరిమితి సడలింపు ఉంటుంది.

ధరఖాస్తులు స్వీకరణకు ఆఖరు తేదీ.. 2009, డిసెంబర్ 2.
మరిన్ని వివరాలకడబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూడాట్ఐటీబీపోలీస్‌డాట్‌నిక్‌డాట్ఇన్.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.