గత సంవత్సరం జూన్ మాసంలో నిర్వహించిన ఇంజినీరింగ్ సర్వీసెస్ రాత పరీక్షల ఫలితాలను యూపీఎస్‌సీ శుక్రవారం ప్రకటించింది. వ్యక్తిత్వ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు మార్చి 17 నుంచి ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. ఖచ్చితమైన తేదీని ఇంటర్వ్యూ లేఖ ద్వారా తెలియజేస్తామని యూపీఎస్‌సీ ఒక ప్రకటనలో పేర్కొంది.
సమగ్రమైన దరఖాస్తు ఫారాలను (డీఏఎఫ్) అర్హత పొందిన అభ్యర్థులకు త్వరలో జారీ చేస్తామని తెలిపింది. పూర్తి చేసిన డీఏఎఫ్‌ను జారీ చేసిన తేదీ నుంచి 10 రోజుల కాల వ్యవధిలోగా అభ్యర్థులు అందచేయాలని పేర్కొంది.
జనవరి 18లోగా డీఏఎఫ్‌ను పొందని అభ్యర్థులు కమీషన్ కార్యాలయానికి చెందిన టెలిఫోన్ నంబర్: 23387402 లేదా ఫ్యాక్స్ నెంబర్: 011-23387310 ను సంప్రదించవలసిందిగా విజ్ఞప్తి చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు పీఐబీ.ఎన్ఐసీ.ఐఎన్ వెబ్‌సైట్ ద్వారా రాత పరీక్ష ఫలితాలను పొందవచ్చు.
|