ఎండిఎస్ మొదటి సంవత్సర పరీక్ష ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. హెల్త్ యూనివర్శిటీ జాయింట్ రిజిస్ట్రార్ (పరీక్షల విభాగం) ఎఎన్ మూర్తి ఫలితాలను విడుదల చేశారు.
ఈ ఫలితాలను విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో ఉంచామని మూర్తి వెల్లడించారు. జవాబు పత్రాలను స్వయంగా పరిశీలించాలనుకునే విద్యార్థులు, రీ కౌంటింగ్ కోరుకునే వారు ఒక్కో పేపర్‌కు రూ.500లను చెల్లించి ఈ నెల 16వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ నెల 22న అభ్యర్థుల సమక్షంలో రీకౌంటింగ్ జరుగుతుందని మూర్తి వివరాలందించారు.
ఇదిలా ఉండగా హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో వివిధ కోర్సులలో చేరడానికి శుక్రవారం నుండి అడ్మిషన్లు ప్రారంభంమయ్యాయి. విశ్వవిద్యాలయం పీజీకోర్సుఫలితాల జాబితాలను విడుదల చేసి, అడ్మిషన్లను ప్రారంభించింది. ఈ విశ్వవిద్యాలయంలో చేరడానికి సంబంధించిన వివరాలను, కౌన్సిలింగ్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి యూనివర్శిటీ వెబ్‌సైట్‌లో చూడవచ్చని తెలిపింది.
|