ప్రధాన పేజి > వార్తలు > కెరీర్ > ఫలితాలు > ఎన్టీఆర్ వర్సిటీ జులై పరీక్షల ఫలితాల విడుదల
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఎన్టీఆర్ వర్సిటీ జులై పరీక్షల ఫలితాల విడుదల Search similar articles
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ జూన్, జులై నెలల్లో నిర్వహించిన సూపర్ స్పెషాలిటీ (డీఎం, ఎంసీహెచ్), పీజీ (డిగ్రీ, డిప్లొమా), మొదటి ఏడాది బీజీఎస్ పరీక్షల ఫలితాలను సోమవారం విడుదల చేసింది. ఇందులో బీడీఎస్ ఫలితాలకు సంబంధించి ఐదు గ్రేస్ మార్కులు కలిపి విడుదల చేసినట్టు యూనివర్సిటీ పేర్కొంది.

ఈ విషయమై యూనివర్సిటీ జాయింట్ రిజిస్ట్రార్ ఏఎన్ మూర్తి మాట్లాడుతూ పీజీ, మొదటి ఏడాది బీడీఎస్ పరీక్ష రాసిన అభ్యర్ధులు తమ జవాబు పత్రాల వ్యక్తిగత పరిశీలన, రీ టోటలింగ్‌ల కోసం ఆగస్ట్ 14 లోపల ప్రతి సబ్జెక్ట్‌కు రూ. 500 చొప్పున చెల్లించి యూనివర్సిటీలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

అలాగే సూపర్ స్పెషాలిటీ పరీక్షల ఫలితాలను ఆయా కళాశాలల ఎగ్జామినర్లకు పంపడం జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం విడుదల చేసిన ఫలితాలు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పొందపర్చబడి ఉన్నాయని చెప్పారు.
మరిన్ని
'వెబ్‌దునియా తెలుగు'లో టెన్త్ సిప్లమెంటరీ ఫలితాలు
ఎండిఎస్ మొదటి సంవత్సర ఫలితాలు
టెన్త్ ఫలితాల్లో బాలికల హవా
ఇంజినీరింగ్ సర్వీసెస్ ఫలితాలు విడుదల
పీసెట్ ఫలితాలు విడుదల
కోట విశ్వవిద్యాలయం ఫలితాలు