రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్‌బి) ఆధ్వర్యంలో అక్టోబరు 12వ తేదీన నిర్వహించిన ప్రవేశ పరీక్షల ఫలితాలను తాజాగా విడుదల చేసింది. చంఢీగర్ విభాగంలో కమర్షియల్ క్లర్క్, టిక్కెట్ ఎగ్జామినర్, ట్రైన్ క్లర్క్ పోస్టుల భర్తీ కోసం ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. ఇందులోభాగంగా రెండో దశలో నిర్వహించిన ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులను డాక్యుమెంట్ల పరిశీలనకు అర్హులుగా ప్రకటించారు. ఇలాంటి అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలన ఈనెల 21వ తేదీ నుంచి జరుగనుంది.
అర్హులైన విద్యార్థులకు ఇప్పటికే కాల్‌లెటర్స్‌ను పంపినట్టు ఆర్ఆర్‌బి ఒక ప్రకటనలో పేర్కొంది. కాల్‌లెటర్లు అందుకున్న అభ్యర్థులు తమకు సూచించిన తేదీల్లో "రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, ఎస్సీఓ - 34, రెండో అంతస్తు, మధ్యామార్గ్, సెక్టార్-7 సి, చంఢీగర్-160019" అనే చిరునామాలో రిపోర్టు చేయాల్సి వుంటుంది. ముఖ్యంగా రిపోర్టింగ్‌కు వెళ్లే ఎస్సీ, ఎస్టీ, ఓబిసి విద్యార్థులు తన ఒరిజినల్ కులధృవీకరణ పత్రాలను వెంట విధిగా తీసుకెళ్లాల్సి వుంటుంది. |