నేషనల్ ఢిఫెన్స్ అకాడెమీ, నావల్ అకాడెమీలలో కోర్సుల కోసం నిర్వహించిన రాత పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో రాత పరీక్షలు నిర్వహించారు. ఇందులో మెరిట్ జాబితా ప్రకారం 456 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. వీరికి నేవీ అకాడెమీ (41వ కోర్సు), డిఫెన్స్ అకాడెమీ (121కోర్సు)లలో డిసెంబరు నెలాఖరులో శిక్షణా తరగతులు ప్రారంభమవుతాయి. కాగా, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు కేటగిరీలలో 183 మంది సాధారణ అభ్యర్థులు ఉన్నారు.
ఇవి కాకుండా మరో 335 ఖాళీలు ఉన్నాయి. వీటిలో ఆర్మీలో 195 పోస్టులు, 39 నేవీ, 66 ఎయిర్ ఫోర్సు, 35 నావల్ అకాడెమీ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు నిర్వహించిన రాత ఫలితాలను 20-26 తేదీ ఎంప్లాయిమెంట్ న్యూస్‌లో చూడొచ్చు. లేదా పూర్తి సమాచారం కోసం 23385271, 23381125, 23098543 ఫోన్ నంబర్లలో ఉదయం పది గంటల నంచి సాయంత్రం ఐదు గంటల మధ్య న్యూఢిల్లీలోని యూపీఎస్సీ భవనంలో తెలుసుకోవచ్చు. |