ప్రధాన పేజి > వార్తలు > కెరీర్ > ఫలితాలు > సీబీఎస్ఈ ఫలితాల్లో బాలికలదే పైచేయి
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
సీబీఎస్ఈ ఫలితాల్లో బాలికలదే పైచేయి
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) శుక్రవారం గౌహతి, ఢిల్లీ, అలాహాబాద్ జోన్ల 12 తరగతి ఫలితాలు వెల్లడించింది. ఈ ఫలితాల్లో బాలురకంటే బాలికలదే పైచేయిగా ఉంది. దేశవ్యాప్తంగా సుమారు 637,000 మంది విద్యార్థులు మార్చిలో జరిగిన 12వ తరగతి పరీక్షలకు హాజరయ్యారు. శుక్రవారం ఉదయం పది గంటలకు సీబీఎస్ఈ పరీక్షా ఫలితాలను అధికారిక యంత్రాంగం విడుదల చేసింది

ఈ ఫలితాలు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.సీబీఎస్ఈ.ఎన్ఐసీ.ఇన్ వెబ్‌సైట్‌‍లో అందుబాటులో ఉంటాయి. అజ్మీర్, చెన్నై, పంచకులా ప్రాంతాల 12వ తరగతి ఫలితాలను సీబీఎస్ఈ విడుదల చేసింది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 637,578 మంది విద్యార్థులు సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 264,248 బాలికలుకాగా, 373,330 మంది బాలురు ఉన్నారు.

ఈసారి 12వ తరగతి పరీక్షల్లో బాలుర కంటే బాలికలు మెరుగైన ఫలితాలు సాధించారు. బాలుర 77.40 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలికలు 85.94 శాతం ఉత్తీర్ణత సాధించడం గమనార్హం. ఈ ఏడాది ఉత్తీర్ణతా శాతం 0.09 శాతం మేర పెరిగి 81 శాతానికి చేరింది. చెన్నై ప్రాంతంలో అత్యధికంగా 92.06 శాతం ఉత్తీర్ణత నమోదయింది.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఎల్పీసెట్‌ ఫలితాల విడుదల
యూపీఎస్సీ ఫలితాలు విడుదల
డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్ల పరీక్షా ఫలితాలు విడుదల
ఆర్ఆర్‌బి-చంఢీగర్ పరీక్షా ఫలితాలు విడుదల
ఎన్టీఆర్ వర్సిటీ జులై పరీక్షల ఫలితాల విడుదల
'వెబ్‌దునియా తెలుగు'లో టెన్త్ సిప్లమెంటరీ ఫలితాలు