సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాల్లో ఎప్పటిలా బాలికలే పైచేయి సాధించారు. పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఛండీగర్ ప్రాంతాలకు చెందిన పదోతరగతి ఫలితాలను మంగళవారం విడుదల చేశారు. గత మార్చి నెలలో జరిగిన ఈ పరీక్షా ఫలితాల్లో 88.22 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలికల శాతం 92.25గా ఉంది.
ఈ రీజియన్‌లో సగటు ఉత్తీర్ణత శాతం 90.18 శాతంగా ఉందన్నారు. కాగా, ఈ పరీక్షలకు మొత్తం 1,19,014 మంది విద్యార్థులు హాజరైనట్టు సీబీఎస్ఈ పంచకుల ప్రాంతానికి చెందిన జాయింట్ కార్యదర్శి డీఆర్.యాదవ వెల్లడించారు. గత యేడాదితో పోల్చుకుంటే ఈ దఫా మరింత పెరిగినట్టు చెప్పారు. గత యేడాది 89.07 శాతం కాగా, 2007లో 89.09 శాతంగా ఉన్నదని వివరించారు. |