రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఐసెట్-2009 ఫలితాలను సోమవారం ఆంధ్ర విశ్వవిద్యాలయం సెనేట్‌హాలులో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య కేసీ.రెడ్డి విడుదల చేశారు. మొత్తం పరీక్షకు హాజరైన వారిలో 93.61 శాతం మంది అర్హత సాధించినట్టు ఆయన తెలిపారు. ప్రథమ స్థానంతో పాటు రెండు, మూడు, ఐదు ర్యాంకులను విశాఖ విద్యార్థులే దక్కించుకోవడం గమనార్హం.
కాగా, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు జూలై 10 తేదీలోగా కౌన్సెలింగ్ ప్రారంభించనున్నట్టు వర్సిటీ అధికారులు చెప్పారు. ఈ దఫా వెబ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 30 కేంద్రాల ద్వారా హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేసి విద్యార్థులకు పాస్‌వర్డు ఇస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలల్లో 35,000 ఎంబీఏ సీట్లు, 46,600 ఎంసీఏ సీట్లు వున్నాయని ఆయన వివరించారు. |