ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఉత్పత్తి జరిగి ధరలు లేక కుంగిపోతున్న చక్కెర పరిశ్రమను ఆదుకునే దిశగా కేంద్రం దృష్టి సారించింది. ఈ రంగానికి మరిన్ని రాయితీలను ప్రకటించింది. ఇప్పటికే ఎగుమతులపై సబ్సిడీలను ప్రకటించినట్లు కేంద్ర వ్యవసాయశాఖా మంత్రి ప్రకటించారు. ప్రస్తుతం చక్కెర నిల్వలను 20 లక్షల టన్నులకు పెంచినట్లు ఆయన వివరించారు.
దేశీయ అవసరాలకు దాదాపు 190 లక్షల టన్నుల చక్కెర నిల్వలు అవసరం కాగా ప్రస్తుతం 300 లక్షల టన్నుల చక్కెరను కలిగి ఉన్నట్లు ఆయన తెలియజేశారు. చెరకు రైతుల ప్రయోజనాలను కూడా దృష్టిలో పెట్టుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
|