సాంకేతిక సమాచార రంగం ఇకపై వ్యవసాయ రంగంలో కూడా దృష్టి సారించింది . వ్యవసాయదారులకు తమ పొలాల గురించి సమాచారం జిల్లా కేంద్రాల్లో అందుబాటులో ఉంచనున్నారు. దీనివల్ల రైతులు ఏ పంటలు వస్తే ఆదాయాన్ని పొందవచ్చుననే అంశాన్ని ముందుగానే తెలుసుకొనవచ్చును.
దీనివలన ఎరువుల పంపీణీకి కూడా ప్రభుత్వం ముందుగానే చర్యలు తీసుకోవచ్చునని భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్) అసిస్టెంట్ డైరక్టర్ శర్మ వెల్లడించారు. జిల్లాల వారీగా డిజిటలైజ్డ్ సాయిల్ మ్యాప్‌లను స్థిరీకరించి అందుబాటులోనికి తీసుకు వచ్చే పద్దతులను రూపొందిస్తామని అన్నారు.
సహజవనరుల సమర్ధవంతంగా వినియోగించుకోవటానికి, సారవంతమైన నేలలను వ్యవసాయాధిరిత మండలాల అనుగుణంగా విభజించి వాటి జాబితా, వర్గీకరణ, పర్యవేక్షణ కార్యక్రమాలను చేపట్టనున్నట్లు సహజ వనరుల విభాగం (ఎన్‌ఆర్‌ఎమ్) తెలిపింది.
దేశవ్యాప్తంగా వ్యవసాయ భూముల సమాచారాన్ని ఆయా జిల్లా కేంద్రాల్లో అందుబాటులో ఉంచేందుకు తగిన ఏర్పాట్లు చేస్తామని కేంద్ర ఎరువులు రసాయన శాఖ అధికారులు పేర్కొన్నారు.
|