పంటలను నాశనం చేస్తున్న ఎలుకలపై మిజోరం రైతులు యుద్ధం ప్రకటించారు. రైతుల యుద్ధానికి మద్దతుగా ఎలుకలను మట్టుపెట్టిన వారికి పారితోషకాన్ని అందించే విధానానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
ఎలుక తోక ఒక్కింటికి రెండు రూపాయలు ఇస్తామంటూ తాము ప్రవేశపెట్టిన పధకానికి రైతులు అనూహ్యంగా స్పందిస్తున్నారని పంట రక్షణ సహాయ అధికారి జేమ్స్ లాల్సియామ్లియానా తెలిపారు.
ఎలుకను మట్టుపెట్టినందుకు రుజువుగా ప్రజలు ఎలుక తోకను అందించవలసి ఉంటుందని వెల్లడించారు. రోజురోజుకు తమవద్దకు అత్యధిక సంఖ్యలో ఎలుక తోకలు చేరుకుంటున్నాయని జేమ్స్ అన్నారు.
|