భారతదేశపు తొలి తటస్థ భీమా షాపింగ్ వెబ్‌సైట్ అయిన www.InsuranceMall తన యొక్క మోటారు మరియు జీవిత భీమా "కోట్-ఇంజన్స్"ను ఇటీవల ఆవిష్కరించింది. ప్రముఖ భీమా కంపెనీలకు చెందిన అనేక ఉత్పత్తులను ఖాతాదారులు బేరీజు వేసి తమకు నచ్చిన ఉత్పత్తులను కొనుగోలు చేసుకునే సౌకర్యం కల్పించిన ప్రపంచంలోని తటస్థ భీమారంగపు వైబ్‌సైట్‌లలో ఒకటిగా ఈ వెబ్‌సైట్ నమోదైంది.
ఇటీవల భారతీయ భీమారంగంలో చేటుచేసుకున్న ఖాతాదారు సేవలు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను తలదన్నేరీతిలో ఉంటున్నాయి. ప్రపంచంలో ఎక్కడా కనీవినీ ఎరుగని విశేషతలను Insurancemall.inలో అందిస్తున్నట్లు బోన్సాయి ఇన్సురెన్స్ బ్రోకింగ్ సీఈవో మరియు ఎం.డి. అయిన మనీష్ జైస్వాల్ ప్రకటించారు.
ఆరోగ్యం, వ్యక్తిగత ప్రమాదం, తీవ్రమైన అనారోగ్యం, గృహం, ప్రయాణం, విద్య, మోటారు మరియు జీవితభీమా తదితరాలను బేరీజు వేసుకుని కొనుగోలు చేసేందుకు 99% పూర్తి స్థాయి వ్యక్తిగత సేవలను ఈ వెబ్‌సైట్ ప్రస్తుతం అందిస్తున్నది.
"తాము స్వీయ పరిజ్ఞానంతో మోటార్ ఇన్సురెన్స్ కోసం అభివృద్ధి చేసిన కోట్-ఇంజన్ మార్కెట్‌లో కొత్తగా వచ్చే ఉత్పత్తులను ఎప్పటికప్పుడు వినియోగదారులు ముంగిట్లోకి తీసుకువస్తుందని" ఇబిజినెస్ డైరక్టర్ మహావీర్ చోప్రా పేర్కొన్నారు.
|