ప్రధాన పేజి   వార్తలు > ఆర్థికం > కథనాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
గురువారం నిఫ్టీకి 5 వేల పాయిట్లు....
Rajesh Palviya
ముంబాయి స్టాక్ మార్కెట్‌లో బుధవారం జరిగిన వాణిజ్యంలో ప్రపంచ మార్కెట్లనుంచి లభించిన మద్దతుతో వివిధ కంపెనీల షేర్లు లాభాలతో ముందుకుసాగాయి. గతంలో మాదిరి కాకుండా రియాల్టీ, విద్యుత్, లోహాలు స్టాక్స్ బుధవారం బలపడ్డాయి. ఎఫ్ఎంసీజీ, బ్యాకింగ్, షుగర్ స్టాక్స్ బుధవారం ట్రేడింగ్‌లో కొంతమేర ఒత్తిడికి గురయ్యాయి. మార్కెట్ బుధవారం కొనసాగిన విధం పరిశీలిస్తే నష్టాల భయం నుంచి కోలుకుంది. మార్కెట్ రెండో సెషన్‌లో మాత్రం మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ రంగాలు నష్టాలు చవిచూశాయి. నిఫ్టీలో ఆర్ఎన్ఆర్ఎల్, రిలయన్స్, రిలయన్స్ క్యాపిటల్, యూనిటెక్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి షేర్లపై ట్రేడర్లు ఆసక్తిచూపారు. బుధవారం ట్రేడింగ్‌లో నిఫ్టీ 91.20 పాయింట్లు లాభపడి 4,929 పాయింట్ల వద్ద ముగిసింది.


గురువారం మార్కెట్
స్టాక్ మార్కెట్‌లో గత కొన్నిరోజులుగా నష్టాలతో వాణిజ్యం జరిగిన సంగతి తెలిసిందే. మదుపుదారులు, వాణిజ్యవేత్తలకు నమ్మకం కలిగేలా మార్కెట్ గురువారంనాడు నిలకడ సాధించాల్సిఉంది. మార్కెట్‌లో నిలకడ అనేది కనీసం మూడు సెషన్లపాటు సాగితే బాగుంటుంది. మార్కెట్‌లో బుధవారం జరిగిన వాణిజ్యంలో నిఫ్టీ కూడా ఆశాజనకంగా లాభాలబాట పట్టింది. గురువారం జరిగే మార్కెట్ ట్రేడింగ్‌లో కూడా ఇదే విధమైన జోరు సాగుతుందని ఆశిద్దాం.

నిఫ్టీకి మద్దతునిచ్చిన ఆంశాలు
మార్కెట్‌లో బుధవారం జరిగిన ట్రేడింగ్ పరిశీలిస్తే దాదాపు 5 వేల పాయింట్లను తాకేలా సాగింది. గురువారం జరిగే ట్రేడింగ్‌లో ఇదే సానుకూల అంశాలు కొనసాగి స్వల్ప కాలంలోనే 5,100 పాయింట్లను తాకే అవకాశాలు ఉన్నాయి. నిఫ్టీ ట్రేడింగ్ బుధవారం ఆశాజనకంగా సాగింది. అయితే గురువారం జరిగే ట్రేడింగ్‌లో 4,800 పాయింట్లనుంచి నిఫ్టీ తగ్గకుండా ఉండే బావుంటుంది.
మరిన్ని
బుధవారం నాటి మార్కెట్ ఎలా ఉంటుంది
ఒడిదుడుకులకు గురైన మార్కెట్
కొనసాగనున్న అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం!
గురువారం నాటి మార్కెట్‌కు నిఫ్టీ పరీక్ష!
బుధవారం నాటి మార్కెట్‌లో నిఫ్టీ కీలకం!
మార్కెట్‌లో ఉత్సాహం నింపని ట్రేడింగ్