ప్రధాన పేజి > వార్తలు > ఆర్థికం > కథనాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
స్కెలెటన్ నుంచి సరికొత్త వజ్రాల గడియారం  Search similar articles
WD
స్కెలెటన్ వాచ్ కంపెనీ సరికొత్త వజ్రాల చేతి గడియారాన్ని మార్కెట్‌లోకి విడుదల చేసింది. లగ్జరీ వాచీల తయారీలో స్కెలెటన్‌కు మంచి పేరుంది. స్కెలెటన్ కంపెనీ స్విస్‌లోని బియన్నీ కేంద్రంగా పనిచేస్తుంది. చేతి గడియారాలకు వజ్రాలతో పొదిగి అందంగా రూపొందించడంలో స్కెలెటన్‌కు మొదటి నుంచీ మంచిపేరు ఉంది.

స్కెలెటన్‌కు చెందిన మిల్లరెట్ చేతి గడియారాలకు హస్తకళలతో కొత్త అందాలను అందించటంలో విశేష అనుభవం ఉంది. గత 40 ఏళ్ల కాలంగా ఆభరణాలు, వజ్రాల వ్యాపారంలో మిల్లరెట్‌కు ఘనమైన చరిత్ర ఉంది. మిల్లరెట్ తాజాగా పురుషుల కోసం కొత్త వాచ్‌ను విడుదల చేసింది.

స్కెలెటన్ కొత్త వాచ్‌కు 20 మిల్లీ మీటర్లు మందంలో అందమైన తోలును జోడించారు. వాచీకి 18 క్యారెట్ల బంగారాన్ని వినియోగించారు. ఈ వాచీని రెండు మోడల్స్‌లో అందిస్తున్నారు. ఒకటి బంగారు పూత కలది కాగా, మరొకటి యాంటి రిఫ్లెక్టివ్ గ్లాస్ బాక్-కేస్. స్కెలెటన్ కొత్త వాచీలను తక్కువ సంఖ్యలో మార్కెట్‌లోకి విడుదల చేశారు.

వజ్రాలతో పొదిగిన స్కెలెటన్ కొత్త వాచీ ధర రూ.3.99వేలు మాత్రమే. ఈ వాచీలు భారతదేశంలో ప్రఖ్యాత జ్యూయలరీ షాపుల్లో విక్రయిస్తారు. బెంగళూరులో సి.కృష్ణయ్య చెట్టీ అండ్ సన్స్, చెన్నైలో ఉమ్మిడి బంగారు జ్యూయలర్స్, జీఆర్ తంగమాలిగై జ్యూయలర్స్, నాథెళ్ల సంపత్తు చెట్టి, ముంబయిలో సునీల్ జ్యూయలర్స్ షాపుల్లో ఈ వాచీలు విక్రయానికి అందుబాటులో ఉంచారు.
మరిన్ని
ట్రేడింగ్‌ జోరు : పుంజుకున్న సెన్సెక్స్
మరింత చౌకగా లభ్యం కానున్న హైబ్రిడ్ కార్లు
2008లో కనిష్ట స్థాయికి పడిన మార్కెట్
పారిశ్రామిక రంగంలో భారత్ 41వ స్థానం
పర్యావరణ అనుకూల విమానయానం
నగరాల్లో వెలవెలబోతున్న నక్షత్రాల హోటళ్ళు