విదేశీ పెట్టుబడుల్లో భారత్‌కు అగ్రస్థానం
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టేందుకు అనువైన దేశాల జాబితాలో ప్రస్తుతం భారత్ అగ్రస్థానంలో ఉంది. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ సంస్థలు అధిక స్థాయిలో మొగ్గు చూపుతుండటంతో ఈ జాబితాలో చైనాను రెండో స్థానానికి నెట్టి భారత్ అగ్రస్థానంలో నిలిచింది.
దీనికి సంబంధించి ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన ఓ ప్రకటనలో స్వల్పకాలిక, దీర్ఘకాల పెట్టుబడులకు అనువైన దేశంగా భారత్ ఉందని పేర్కొంది. ఇలా ఎంపిక చేసినందుకు గల కారణాలను కూడా ప్రపంచ బ్యాంకు వివరించింది.
చైనాలో దీర్ఘకాల పెట్టుబడులు పెట్టే కంపెనీల శాతం క్రమంగా తగ్గుతూ వచ్చిన విషయాన్ని ప్రపంచ బ్యాంకు వర్గాలు గమనించాయి. అయితే అంతర్గతంగా, అంతర్జాతీయంగా భారత్‌లో పెట్టుబడుల శాతం క్రమంగా పెరుగుతూ వచ్చింది.
ఈ కారణంగానే భారత్ పెట్టుబడులకు అనువైన దేశంగా మారిందని ఆ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఇక జపాన్ కంపెనీల సంగతికి వస్తే, భారత్‌కు అగ్రస్థానం ఇచ్చేందుకు అవి అంగీకరించాయి.
అయినా స్వల్పకాలిక పెట్టుబడుల్లో మాత్రం చైనానే అగ్రస్థానంలో ఉంది. ఈ జాబితాలో చైనా, భారత్, అమెరికా, రష్యా, బ్రెజిల్, వియత్నాంలు ఉన్నాయి. తక్కువ వేతనాలకే కార్మికులు లభించడంతో వియత్నాం పెట్టుబడుల్లో ఆరో స్థానంలో నిలిచింది.