ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం కారణంగా బ్రిటన్‌లో బిలియనీర్ల సంఖ్య 75 నుంచి 2008లో 43కు తగ్గింది. కాని కోలకతాకు చెందిన ఉక్కు పారిశ్రామికవేత్త లక్ష్మీ మిట్టల్ (58) తన సంపద 27.7 బిలియన్ పౌండ్ల (40.44 బిలియన్ డాలర్లు) నుంచి భారీ ఎత్తున 61 శాతం మేర అంటే 10.8 బిలియన్ పౌండ్లకు తగ్గినప్పటికీ సంపన్నుల జాబితాలో అగ్ర స్థానంలోనే కొనసాగుతున్నారు.సండే టైమ్స్ పత్రిక ప్రకటించిన వార్షిక జాబితా ప్రకారం, మిట్టల్ సంపద రష్యాలో జన్మించిన రోమన్ అబ్రమోవిచ్ (42) కన్నా రెండింతలు అధికంగా ఉంది. అబ్రమోవిచ్ సంపద ప్రస్తుతం 4.7 బిలియన్ పౌండ్లు. ఇది నిరుడు 11.7 బిలియన్ పౌండ్లుగా నమోదైంది.ఈ సంవత్సరం జాబితాలో నుంచి హిందూజా సోదరులు అదృశ్యం కావడం గమనార్హం. వారు 6.2 బిలియన్ పౌండ్ల విలువ చేసే సంపదతో క్రితం సంవత్సరం నాలుగవ స్థానంలో ఉన్నారు.ఈ సంవత్సరం టాప్ 10 బిలియనీర్లలో చోటు సంపాదించిన ఏకైక భారతీయుడు మిట్టల్ కావడం గమనార్హం. ఈ జాబితాలో భారత సంతతికి చెందిన వారు 29 మంది ఉన్నారు.ఇదిలా ఉండగా, అత్యంత సంపన్నులైన ఇద్దరు భారతీయులు ఉక్కు పారిశ్రామికవేత్త లక్ష్మీ మిట్టల్, రియల్ ఎస్టేట్ ప్రముఖుడు కె.పి. సింగ్ కుమార్తెలు వరుసగా వనీషా మిట్టల్ భాటియా, పియా సింగ్ అత్యంత ప్రముఖ బిలియనీర్ వారసురాళ్ళు ఫోర్బ్స్ పత్రిక జాబితాలో చోటు చేసుకున్నారు.హోలీ బ్రాన్సన్, ఇవాంకా ట్రంప్, మీర్జా బావుర్, మరీనా బెర్లూస్కోని వంటి వారు కూడా ఈ పత్రిక జాబితాలో స్థానం సంపాదించారు. ఇతరులు అనేక మంది వలె వారు ఈ జాబితాలో పేర్కొనడాన్ని ఇష్టపడలేదని, 'సండే టైమ్స్' పత్రిక వారి ఆకాంక్షను మన్నించిందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. |