ప్రస్తుతం ఆర్థికమాంద్యం కారణంగా వివిధ ప్రైవేటు సంస్థలలోని ఉద్యోగులు తమ ఇండ్లకు తిరుగుముఖం పడుతుండటంతోబాటుగా వారిలో ప్రభుత్వ ఉద్యోగాలను పొందేందుకు ఆసక్తి నానాటికీ పెరిగిపోతోంది. ప్రభుత్వ ఉద్యోగం పట్ల వీరి ఆకర్షణ కేవలం సురక్షితంగా ఉంటుందనేది నిర్వివాదాంశం. అలాగే జీవితం సాఫీగా సాగిపోతుందనేది వారి ఆలోచన. గతంలో సాఫ్ట్‌వేర్ రంగాన్ని ఎంచుకుని ఆ రంగంలో ఓ వెలుగు వెలిగినవారుకూడా ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగమే మేలని నేటి యువత భావిస్తోంది.
మాంద్యంకారణంగా ఉద్యోగాల కొరత ఏర్పటడటంతో ప్రభుత్వ ఉద్యోగాలకోసం ప్రతి ఒక్కరు వెంపర్లాడుతున్నారని ఉద్యోగుల సేవా సంస్థ అయిన మ్యాన్ పవర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ నరేష్ మల్హన్ తెలిపారు. దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో భాగంగా ఆ ప్రభుత్వం నిరుద్యోగులకు సముచితస్థానం కల్పించి ఉద్యోగాలను కల్పిస్తుంది నిరుద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నారని ఆయన తెలిపారు.
మాంద్యంకారణంగా ఉద్యోగాలను కొల్పోయిన వారి పరిస్థితి మరికొన్ని నెలలు ఇలాగే ఉంటుందని తమ సర్వేలో తేలినట్లు ఆయన పేర్కొన్నారు. ఇదిలావుండగా ప్రభుత్వం ఆరవ పే కమిషన్‌ను అమలు చేయడంతో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ప్రస్తుతం మెరుగ్గానే ఉన్నాయని, ఇదికూడా ఒక కారణంగా నిరుద్యోగులు భావిస్తున్నట్లు సమాచారం. దీంతో ప్రైవేటు ఉద్యోగాలకన్నాకూడా ప్రభుత్వ ఉద్యోగాలే మేలనిపిస్తోందని సర్వేలో పాల్గొన్న చాలామంది నిరుద్యోగులు తెలిపినట్లు ఆయన వివరించారు.
ప్రస్తుతం నెలకొన్న ఆర్థికమాంద్యంకారణంగానే చాలామంది నిరుద్యోగులలో ప్రభుత్వ ఉద్యోగంగా ఎలాంటి ఉద్యోగమైనా ఫరవాలేదని వారు భావిస్తున్నట్లు మల్హన్ తెలిపారు.
శిక్షా క్షేత్రంలో ప్రస్తుతం ఉద్యోగాలు చాలా లభ్యమవుతున్నాయని, వీటికి సంబంధించిన వారు ఈ రంగంలో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించుకుని ప్రభుత్వ ఉద్యోగాలను పొందేందుకు వీలుగా ప్రభుత్వం వారికి ఉద్యోగావకాశాలను కల్పించనుందని మ్యాన్ పవర్ పేర్కొంది.
ఇదిలావుండగా ప్రభుత్వ పరంగా అయితే పరిపాలనాన పరంగా ఉండే ఉద్యోగాలు అలాగే విద్య విభాగంలో ఆశాజనకమైన ఉద్యోగాలు అత్యధికంగా లభ్యమవుతాయని ఆ సంస్థ వివరించింది. కాగా ఆర్థిక రంగం, బీమా, రియల్ ఎస్టేట్ రంగాలవైపుకు వెళ్ళవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఆ రంగాలు ఇంకా మాంద్యంనుంచి కోలుకోలేదని వారు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం వీటి నెట్ ఎంప్లాయిమెంట్ ఔట్‍లుక్ కేవలం 11శాతంమాత్రమే ఉందని వారు పేర్కొన్నారు.
ప్రభుత్వ రంగంలోని విద్యాశాఖ, ప్రణాళికాశాఖ, పరిపాలనాశాఖలు ప్రతి మూడు నెలలకు ఒకసారి కొత్తగా ఉద్యోగులను నియమించుకోనున్నట్లు, దీనికి ఆయా విభాగాలలో తర్ఫీదు పొందినవారు అలాంటి ఉద్యోగాల కోసం ప్రయత్నించవచ్చని ఆయన వివరించారు.
కాగా దేశీయ అతిపెద్ద బ్యాంక్ అయిన భారతీయ స్టేట్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వివిధ విభాగాలలో దాదాపు 13వేలమందిని నియమించనున్నట్లు ఆ బ్యాంక్ గతంలోనే ప్రకటించినట్లు మల్హన్ గుర్తు చేశారు.
ప్రాథమికంగా వివిధ ప్రభుత్వ బ్యాంకులు, జాతీయ బ్యాంకులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 30 వేలమందిని కొత్తగా నియమించుకోనున్నట్లు గతంలో ప్రకటించాయి. |