ప్రధాన పేజి > వార్తలు > ఆర్థికం > కథనాలు > బీరు ప్రియులకు శుభవార్త...!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
బీరు ప్రియులకు శుభవార్త...!
FILE
బీరు ఇప్పుడు ఇష్టమైన రుచిలో లభ్యం కానుంది. ఇదెలా అంటారా... క్రాఫ్ట్ బీరు దేశీయ మార్కెట్లో విడుదలైన సందర్భంగా బీర్ మార్కెట్లో సంచలనం సృష్టిస్తుందనడంలో సందేహం లేదని కంపెనీ వర్గాలు తెలిపాయి.

ప్రస్తుతం బీర్ మార్కెట్లో లాగర్ బీర్, తదితర బ్రాండ్లు ప్రముఖంగా ఉన్నాయి. కాని ప్రస్తుతం ఈ బీర్ మిగిలిన దేశీయ మార్కెట్లోని బీర్లకు పోటీగా నిలుస్తుందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

ప్రపంచవ్యాప్తంగా బీరు సేవించేవారిలో భారతదేశీయులు 30శాతం వెనకున్నారని క్రాఫ్ట్ బీర్ కంపెనీకి చెందిన ఛైర్మెన్ డేవిడ్ హోమ్ తెలిపారు. దేశంలో క్రాఫ్ట్ బీర్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భారతదేశం బయట బీరు మార్కెట్‌ను రెండు భాగాలుగా విభజించవచ్చని ఇందులో 80శాతంమంది బీరు ప్రియులు లాగర్ బీరు వాడుతున్నారని అదే ఇరవై శాతం మంది క్రాఫ్ట్ బీరునుపయోగిస్తున్నారని ఆయన అన్నారు.

రానున్న 2011వ సంవత్సరాంతానికి భారతదేశంలో బీర్ల అమ్మకాలు ప్రతి ఏడాదికి 17.2శాతం పెరుగుతుందని, అదే ప్రత్యేకమైన రుచులలో తమ బీరును అందించి వినియోగదారుల మనసును దోచుకుంటామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం క్రాఫ్ట్ బీరు దేశీయ మార్కెట్లో సంచలనం సృష్టిస్తుందని వెల్ గ్రో ప్రధాన మేనేజర్ రాజీవ్ బజాజ్ అన్నారు. ఈ బీరును రుచికరంగా రూపొందించామని, మిగిలిన బీర్లకన్నాకూడా చాలా బాగుంటుందని ఆయన తెలిపారు. క్రాఫ్ట్ బీరును ఐదు రుచులలో తయారు చేస్తున్నారని, దీనిని ప్రజలు బాగా ఆదరిస్తారని ఆయన తెలిపారు.

క్లబ్బుల్లో క్రాఫ్ట్ బీరు ఓ ప్రత్యేకతను సంతరించుకుంటుందని వినియోగదారుల మనసు దోచుకుంటుందని టీవీబీ గ్రూప్ ఇండియా ప్రధాన కార్యనిర్వహణాధికారి హబీబ్ కమల్ తెలిపారు.

ఇదిలావుండగా క్రాఫ్ట్ బీరు మార్కెట్లో దాదాపు 25 నుంచి 30 శాతం మేరకు విస్తరిస్తుందని, దీనిని మహిళలుకూడా చాలా ఇష్టపడగలరని, ఎందుకంటే మహిళలు చేదును ఎక్కువగా ఇష్టపడరని కాబట్టే వారు బీరును ఎక్కువగా త్రాగరని ఆయన తెలిపారు.

తమ బీరును వాడే వినియోగదారులందరూ తమ బీరును తప్పకుండా స్వాగతిస్తారని, తాము ప్రవేశపెట్టే అన్ని రకాల రుచులను వారు ఆస్వాదిస్థారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

కాగా తమ బ్రాండ్‌ ఇతర బీర్లకు గట్టి పోటీ ఇవ్వగలదని, క్రాఫ్ట్ బీరు మార్కెట్లో సంచలనం సృష్టిస్తుందని డేవిడ్ తెలిపారు. దేశీయ బీర్లకు గిరాకీ తగ్గుతుందని, కాని తమ వ్యాపార లక్ష్యం ఇతర బీర్లకుపోటీకాదన్నారు. తాము వినియోగదారులకు అందించే వివిధ రుచులు తమ బీర్లలో ఉంటుందని, దీనిని ప్రతి వినియోగదారుడు ఇష్టపడతారని ఆయన పేర్కొన్నారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ప్రభుత్వ ఉద్యోగాల పట్ల మక్కువ : యువత
ధర చుక్కలనంటినా.. వన్నె తగ్గని పసిడి..!!
నష్టపోయినా నేనే ఫస్ట్: మిట్టల్
మాంద్యాన్ని ఓడించనున్న నానో కారు
జీడీపీ 7% కాదు 3% అవుతుంది: మోర్గాన్
భారత్‌ను ఆవహిస్తున్న ఆర్థిక మాంద్యం