రాబోయే రోజుల్లో నానోకారు రోడ్లపై జుయ్య్‌మంటూ తిరగనుంది. మరి ఇవి ఎక్కడ నిర్మితమవుతున్నాయో తెలుసా...!టాటా మోటార్స్‌కు చెందిన నానోకారు ఉత్తరాఖండ్‌లోని పంత్ నగర్ ప్లాంట్‌లో రూపొందించపబడుతున్నాయి. ఈ ప్లాంట్‌లో ఏడాదికి కేవలం 50వేల వాహనాలే తయారవుతాయి. కాని మార్కెట్లో వీటికి విపరీతమైన డిమాండ్ ఉండటం చేత ఆ సంస్థ గుజరాత్ రాష్ట్రంలోని సానంద్‌లో ఓ పెద్ద ప్లాంట్‌ను రూపొందించనుంది. దీంతో ఇక్కడినుంచి ప్రతి సంవత్సరం రెండు లక్షల కార్లు తయారుకానున్నాయి. ఈ ప్లాంట్ ఈ ఏడాది డిసెంబరు చివరికి పూర్తవుతుందని కంపెనీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో వచ్చే ఏడాదినుంచి ప్రతి సంవత్సరం రెండున్నర లక్షల కార్లు తయారు చేసే స్థాయికి చేరుకుంటుంది. ఇదిలావుండగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నానో కారు ద్వారా ఎలాంటి లాభాలుండవని కంపెనీ తెలిపింది. కాని టాప్ వేరియెంట్ కారుకోసం బుక్ చేసిన సొమ్ము ఎక్కువగా ఉండటంతో మార్జిన్ బాగానే ఉంటుందని ఆ కంపెనీ అధికారులు భావిస్తున్నారు. కాగా నానో కారు మార్కెట్లోకి వచ్చిన తర్వాత దాని సామర్థ్యం ఏపాటిదో తెలుస్తుందని, అప్పుడుకాని ఈ బుల్లికారు డిమాండ్ తెలిసి రాదని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. |